అంబటి రాయుడిపై ఐసీసీ నిషేదం

అంబటి రాయుడిపై ఐసీసీ నిషేదం

Updated On : June 21, 2021 / 3:43 PM IST

అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా భారత క్రికెటర్ అంబటి రాయుడిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు బౌలింగ్ యాక్షన్‌ అనుమానస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయం ఐసీసీకి చేరింది. వెంటనే స్పందించిన క్రికెట్ కౌన్సిల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ కొనసాగించాలంటే 14 రోజుల వ్యవధిలో నిర్దేశించిన టెస్టుకి హాజరు కావాలని రాయుడ్ని ఆదేశించింది. కానీ గడువులోగా రాయుడు బౌలింగ్ యాక్షన్ టెస్టుకు హాజరుకాలేదు. దీంతో బౌలింగ్ చేసేందుకు వీల్లేకుండా ఐసీసీ రాయుడిపై సస్పెన్షన్ విధించింది.

 

ఐసీసీ నిబంధనల్లో 4.2 క్లాజ్ ప్రకారం సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని కౌన్సిల్ తెలిపింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుకి హాజరైతే మోచేతిని నిబంధనలకు అనుగుణంగానే వంచుతున్నాడా అని పరీక్షిస్తారు. ఐసీసీ నుంచి ఆమెదం లభించకపోయినా బీసీసీఐ అనుమతిస్తే దేశీవాలీ లీగ్‌లలో ఆడుకోవచ్చని ఐసీసీ తెలిపింది.

 

ఇక పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ రాయుడు తన వన్డే కెరీర్‌లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్‌ చేయలేదు. సిడ్నీవేదికగా జరిగిన మొదటి వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు.