Ind vs Aus 1st ODI : 5 వికెట్ల తేడాతో భారత్ విజయ దుందుభి

మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది.

Ind vs Aus 1st ODI : 5 వికెట్ల తేడాతో భారత్ విజయ దుందుభి

@BCCI

Updated On : September 22, 2023 / 9:52 PM IST

తొలి వన్డే మనదే 

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 71, శుభ్‌మన్ గిల్ 74, శ్రేయాస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 58 (నాటౌట్), ఇషాన్ కిషన్ 18, సూర్యకుమార్ యాదవ్ 50, రవీంద్ర జడేజా 3 (నాటౌట్) పరుగులు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 276 పరుగులు చేసి, ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత్ స్కోరు 48.4 ఓవర్లకు 281/5.

నిలకడగా ఆడుతున్న రాహుల్, సూర్య
భారత్ స్కోరు 43 ఓవర్లకు 238/4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (36), సూర్యకుమార్ యాదవ్ (33) ఉన్నారు.

మిడిల్ ఆర్డర్ పైనే భారం
భారత్ స్కోరు 33 ఓవర్లకు 185/4గా ఉంది. మిడిల్ ఆర్డర్ పైనే భారం పడింది. ఇషాన్ కిషన్ 18 పరుగులకే ఔటయ్యాడు. క్రీజులో కేఎల్ రాహుల్ (16), సూర్యకుమార్ యాదవ్ (0) ఉన్నారు.

గిల్ ఔట్
శుభ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. 74 పరుగులు బాది జంపా బౌలింగ్ లో వెనుదిరిగాడు. స్కోరు 26 ఓవర్లకు 157/3గా ఉంది.

రుతురాజ్ గైక్వాడ్ ఔట్

రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ ఔట్ అయ్యారు. 71 పరుగులు బాది జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చి 3 పరుగులకే రనౌట్ అయ్యాడు. 24 ఓవర్లలో భారత్ స్కోరు 149/2గా ఉంది.

గిల్ హాఫ్ సెంచరీ
టీమిండియా స్కోరు ఒక్క వికెట్ కూడా పడకుండా 15 ఓవర్ల వద్ద 100 దాటింది. గిల్ హాఫ్ సెంచరీ బాదాడు. క్రీజులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (42), శుభ్‌మన్ గిల్ (57) ఉన్నారు.

10 ఓవర్లకు టీమిండియా స్కోరు..

భారత్ స్కోరు 10 ఓవర్ల వద్ద 66గా ఉంది. ఒక వికెట్ కూడా నష్టపోలేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (32), శుభ్‌మన్ గిల్ (32) క్రీజులో ఉన్నారు.

టీమిండియా లక్ష్యం 277

టీమిండియా ముందు ఆస్ట్రేలియా 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బౌలర్లలో షమీ 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 స్కోరు చేసి, ఆలౌట్ అయింది.

7 వికెట్లు డౌన్
ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. స్కోరు 48 ఓవర్లకు 253/7గా ఉంది.

45 ఓవర్లకు 230/5 

ఆస్ట్రేలియా స్కోరు 45 ఓవర్లకు 230/5గా ఉంది. క్రీజులో జోష్ ఇంగ్లిస్ (36), స్టొయినిస్ (21) ఉన్నారు.

40 ఓవర్లకు 187/5
ఆస్ట్రేలియా స్కోరు 40 ఓవర్లకు 187/5గా ఉంది. కెమరాన్ గ్రీన్ 31 పరుగులకు రనౌట్ అయ్యాడు.

నెమ్మదిగా ఆడుతున్న కెమరాన్ గ్రీన్

వరుణుడు కరుణించాడు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. కెమరాన్ గ్రీన్ నిదానంగా ఆడుతున్నాడు. 49 బంతులు ఆడి 25 పరుగులు చేశాడు. క్రీజులో అతడితో పాటు జోష్ ఇంగ్లిస్ (11) ఉన్నాడు.

వరుణుడి రాక

మ్యాచ్‌కి 35.4 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డుతగిలాడు. 4 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 166 పరుగులు చేసింది. క్రీజులో కెమరాన్ గ్రీన్ (21), జోష్ ఇంగ్లిస్ (3) ఉన్నారు.

150 పరుగుల స్కోర్ దాటిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. లబుషేన్ 36, కెమరాన్ గ్రీన్ 12 పరుగులతో ఆడుతున్నారు.

మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) అర్థ సెంచరీతో రాణించాడు. స్టీవ్ స్మిత్ 41 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 4 పరుగులే చేశాడు. లబుషేన్(19), కెమరాన్ గ్రీన్(4) క్రీజ్ లో ఉన్నారు. షమీ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

20 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 107/2
ఆస్ట్రేలియా తొలి 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(38), లబుషేన్ (7) ఆడుతున్నారు. డేవిడ్ వార్నర్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు.

ధాటిగా ఆడుతున్న డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా 15 ఓవర్లలో 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడుతున్నాడు. క్రీజులో డేవిడ్ వార్నర్(48)తో పాటు స్టీవెన్ స్మిత్(21) ఉన్నాడు.

10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 42/1
ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(17) డేవిడ్ వార్నర్(17) ఆడుతున్నారు.

5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 19/1
ఆస్ట్రేలియా తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(10) డేవిడ్ వార్నర్(1) ఆడుతున్నారు.

ఆరంభంలోనే ఆసీస్ కు షాక్
ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 4 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్ అవుటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ క్రీజ్ లో ఉన్నారు.

బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్
టాస్ ఓడిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఓపెనర్లుగా వచ్చారు. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తొలి ఓవర్ వేసి 5 పరుగులు ఇచ్చాడు.

Ind vs Aus First ODI : ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా మొహాలి స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులో ఉన్నాడు.

కాగా, ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంతో  ఉన్న టీమిండియా మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ లోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఎలాగైనా ద్వైపాక్షిక సిరీస్ గెలిచి.. ప్రపంచకప్ కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని భావిస్తోంది. మొహాలి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జట్లు

భారత్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(w), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, ఆడమ్ జంపా