Ind vs Aus 3rd ODI : మూడో వన్డేలో టీమ్ఇండియా ఓటమి
వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమ్ఇండియా చివరి వన్డే ఆడేసింది.

Ind vs Aus 3rd ODI
టీమ్ఇండియా ఓటమి
353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది.
కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్..
హేజిల్ వుడ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 41.5వ ఓవర్‌లో 257 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.
శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్..
గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్ సిక్స్ కొట్టిన శ్రేయస్ అయ్యర్ (48; 43 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) అదే ఊపులో మరో షాట్‌కు యత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 38.3వ ఓవర్‌లో 249 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది.
సూర్యకుమార్ యాదవ్ ఔట్..
ఆదుకుంటాడు అని భావించిన సూర్యకుమార్ యాదవ్ (8; 7 బంతుల్లో 1ఫోర్) ఔట్ అయ్యాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 37.2వ ఓవర్‌లో 233 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.
కేఎల్ రాహుల్ ఔట్..
సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతుండడంతో భారీ షాట్ ఆడే క్రమంలో కేఎల్ రాహుల్ (26; 30బంతుల్లో 2ఫోర్లు) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 35.5వ ఓవర్‌లో 223 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 36 ఓవర్లకు భారత స్కోరు 224/4. సూర్యకుమార్ యాదవ్(1), శ్రేయాస్ అయ్యర్ (39) లు ఆడుతున్నారు.
విరాట్ కోహ్లీ ఔట్
అర్థశతకం చేసిన కాసేపటికే విరాట్ కోహ్లీ(56; 61 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) ఔట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ అందుకోవడంతో విరాట్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 26.5వ ఓవర్‌లో 171 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
కోహ్లీ హాఫ్ సెంచరీ
కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో (25.4వ ఓవర్) ఫోర్ కొట్టి 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్లకు భారత స్కోరు 168/2. శ్రేయస్ అయ్యర్ (13), కోహ్లీ (54)లు ఆడుతున్నారు.
రోహిత్ శర్మ ఔట్
దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ (81; 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన రోహిత్ అదే ఊపులో మరో షాట్‌కు యత్నించి అతడికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 20.6వ ఓవర్ లో 144 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
20 ఓవర్లకు భారత స్కోరు 135/1
భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 20 ఓవర్లకు భారత స్కోరు 135/1. విరాట్ కోహ్లీ(40), రోహిత్ శర్మ (75) లు ఆడుతున్నారు.
సుందర్ ఔట్
తడబడుతూ ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ (18; 30 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 10.5 ఓవర్‌లో 74 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
రోహిత్ శర్మ అర్థశతం
కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి రోహిత్ శర్మ 31 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్లకు భారత స్కోరు 72/0. రోహిత్ శర్మ (54), సుందర్ (17)లు ఆడుతున్నారు.
దూకుడుగా ఆడుతున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ
రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరో ఓవర్ వేసిన హేజిల్‌వుడ్ బౌలింగ్ సిక్స్ కొట్టిన రోహిత్ శర్మ పాట్ కమిన్స్ వేసిన ఏడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. 7 ఓవర్లకు భారత స్కోరు 56/0. రోహిత్ శర్మ (46), వాషింగ్టన్ సుందర్ (10) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్‌గా వాషింగ్టన్ సుందర్
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్‌లు వచ్చారు. మొదటి ఓవర్‌ను మిచెల్ స్టార్క్ వేయగా రెండో బంతిని రోహిత్ ఫోర్‌గా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. 1 ఓవర్‌కు భారత స్కోరు 6/0. రోహిత్ శర్మ(5), వాషింగ్టన్ సుందర్(1) ఆడుతున్నారు.
టీమ్ఇండియా లక్ష్యం 353
రాజ్‌కోట్ వన్డేలో ఆసీస్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (96; 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (74; 61 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్ ), లబుషేన్ (72; 58 బంతుల్లో 9 ఫోర్లు) వార్నర్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) లు అర్థశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
లబుషేన్ హాఫ్ సెంచరీ
ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మార్నస్ లబుషేన్ తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 43 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 45 ఓవర్లకు ఆసీస్ స్కోరు 317/6. లబుషేన్ (51), కమిన్స్ (8) ఆడుతున్నారు.
కామెరూన్ గ్రీన్ ఔట్..
ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (9; 13 బంతుల్లో 1 ఫోర్) శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 42.3వ ఓవర్ వద్ద 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది.
మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్..
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (5) బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 38.6వ ఓవర్‌లో 281 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది
అలెక్స్ కేరీ ఔట్..
బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో అలెక్స్ కేరీ(11; 19 బంతుల్లో 1 ఫోర్) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 36.6వ ఓవర్ వద్ద ఆస్ట్రేలియా 267 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
స్టీవ్ స్మిత్ ఔట్..
ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (74; 61 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్ ) ఎల్భీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 31.3వ ఓవర్‌లో ఆస్ట్రేలియా 242 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
మిచెల్ మార్ష్ సెంచరీ మిస్..
ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో (27.6వ ఓవర్)లో భారీ షాట్‌కు యత్నించిన మిచెల్ మార్ష్ (96; 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకానికి నాలుగు పరుగుల దూరంలో ప్రసిద్ద్ కృష్ణ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 215 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ
బుమ్రా బౌలింగ్‌లో (24.3వ ఓవర్)లో ఫోర్ కొట్టి స్టీవ్ స్మిత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో స్మిత్‌కు ఇది 30వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లకు ఆసీస్ స్కోరు 188/1. స్టీవ్ స్మిత్ (52), మిచెల్ మార్ష్ (78) ఆడుతున్నారు.
మిచెల్ మార్ష్ అర్థశతకం
వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి మిచెల్ మార్ష్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోరు 130/1. స్టీవ్ స్మిత్ (25), మిచెల్ మార్ష్ (50) ఆడుతున్నారు.
10 ఓవర్లకు ఆసీస్ స్కోరు 90/1.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో మొదటి పది ఓవర్లు ముగిశాయి. 10 ఓవర్లకు ఆసీస్ స్కోరు 90/1. స్టీవ్ స్మిత్ (7), మిచెల్ మార్ష్ (27) లు ఆడుతున్నారు.
సిక్సర్‌తో వార్నర్ హాఫ్ సెంచరీ.. ఆ వెంటనే ఔట్..
సిరాజ్ బౌలింగ్‌లో(7.5వ ఓవర్‌లో) సిక్స్‌తో వార్నర్ 32 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్ మొదటి బంతికే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ అందుకోవడంతో వార్నర్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 8.1వ ఓవర్‌లో 78 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది.
దంచికొడుతున్న వార్నర్
మొదటి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన వార్నర్ ఆ తరువాత చెలరేగి ఆడుతున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఏడో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు ఆసీస్ స్కోరు 65/0. డేవిడ్ వార్నర్ (43), మిచెల్ మార్ష్ (22) ఆడుతున్నారు.
16 పరుగులు
ఈ సారి వార్నర్ బ్యాట్ ఝుళిపించాడు. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ ఫోర్, రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 16 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 37/0. డేవిడ్ వార్నర్ (18), మిచెల్ మార్ష్ (19) ఆడుతున్నారు.
దూకుడుగా ఆడుతున్న మార్ష్
ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వచ్చారు. మొదటి రెండు ఓవర్లను ఆచితూచి ఆడారు. బుమ్రా వేసిన మూడో ఓవర్‌లో మార్ష్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ ను కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 21/0. డేవిడ్ వార్నర్ (2), మిచెల్ మార్ష్ (19) ఆడుతున్నారు.
భారత తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా తుది జట్టు : మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హేజిల్‌వుడ్
Ind vs Aus 3rd ODI : వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమ్ఇండియా చివరి వన్డే ఆడుతోంది. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ జట్టులో చేరగా వైరల్ ఫీవర్ కారణంగా ఇషాన్ కిషన్ దూరం అయ్యాడు. ఇక రెండు మ్యాచుల్లో అదరగొట్టిన అశ్విన్‌ను పక్కన బెట్టి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు ఇచ్చారు.