IND vs BAN : అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్.. లడ్డూలాంటి క్యాచ్‌ను వదిలేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు ఫీలైతే ఏం లాభం?
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ వచ్చింది. అయితే..

IND vs BAN Axar Patel Hat Trick miss Rohit Sharma Drops Easy Catch
ఛాంపియన్స్ ట్రోఫీపై టీమ్ఇండియా కన్నేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడతోంది. దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోర్ సాధించి భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాలని బంగ్లాదేశ్ భావించింది. అయితే.. భారత బౌలర్లు విజృంభించడంతో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్‌లోనే మహ్మద్ షమీ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో సౌమ్య సర్కార్ (0) డకౌట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (0)ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. మరికాసేపటికే మెహిదీ హసన్ మిరాజ్ (5)ను ఔట్ చేయడం ద్వారా షమీ మరోసారి షాక్ ఇచ్చాడు.
AXAR MISSED THE HAT-TRICK..!!!
– Rohit apologised quickly to Axar. pic.twitter.com/TzzXeXqawc
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్..
ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి తాంజిద్ హసన్ (25) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ముష్ఫికర్ రహీమ్ (0)ను సైతం అక్షర్ బోల్తా కొట్టించాడు. అతడు కూడా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ తీసే ఛాన్స్ అక్షర్ కు వచ్చింది.
IND vs PAK : కోహ్లీనే కాదు భారత క్రికెటర్లను ఎవ్వరిని హగ్ చేసుకోవద్దు..
The reaction of Rohit Sharma after dropping the catch. pic.twitter.com/oCgydGjPoq
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
ముష్ఫీకర్ ఔట్ కావడంతో జాకర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపుగా వచ్చింది. అయితే.. ఈ క్యాచ్‌ను రోహిత్ శర్మ జారవిడిచాడు. ఎంతో ఈజీ క్యాచ్ అయినప్పటికి రోహిత్ పట్టుకోలేకపోయాడు. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయింది. ఎప్పుడో ఒకసారి వచ్చే ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ను రోహిత్ వల్ల అక్షర్ కోల్పోయాడు. రోహిత్ శర్మ సైతం క్యాచ్ మిస్ కావడంతో తన చేతిని గ్రౌండ్ పై పదే పదే కొట్టుకున్నాడు.