IND vs ENG 3rd Test Day 3 : ముగిసిన మూడో రోజు ఆట‌

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది.

IND vs ENG 3rd Test Day 3 : ముగిసిన మూడో రోజు ఆట‌

IND vs ENG 3rd Test Day 3

ముగిసిన మూడో రోజు ఆట‌.. భార‌త ఆధిక్యం 322
రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 207/2 తో మూడో రోజు ఆట‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 319 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్ మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి 196/2 తో నిలిచింది. య‌శ‌స్వి జైస్వాల్ (104) శ‌త‌కం చేసి రిటైర్ హ‌ర్ట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకోగా, గిల్ (64), కుల్దీప్ యాద‌వ్‌(3)లు క్రీజులో ఉన్నారు.

గిల్ హాఫ్ సెంచ‌రీ
మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 98 బంతుల్లో గిల్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ
మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇది మూడో శ‌త‌కం కావ‌డం విశేషం.

సిక్స‌ర్‌తో జైస్వాల్ అర్ధ‌శ‌త‌కం..
టామ్‌హార్డ్లీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 80 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌ల‌తో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 28 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 107/1. య‌శ‌స్వి జైస్వాల్ (61), గిల్ (22) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

టీ బ్రేక్‌.. 
మూడో రోజు ఆట‌లో టీ విరామానికి రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ వికెట్ న‌ష్ట‌పోయి 44 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (19), శుభ్‌మ‌న్ గిల్ (5) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతానికి భార‌త్ 170 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

రోహిత్ శ‌ర్మ ఔట్‌
126 ప‌రుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (19) జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 11.3వ ఓవ‌ర్‌లో 30 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ 319 ఆలౌట్‌
రాజ్‌కోట్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 319 ప‌రుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో బెన్ డ‌కెట్ (153) శ‌త‌కంతో చెల‌రేగాడు. బెన్‌స్టోక్స్ (41), ఓలిపోప్ (39) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కుల్దీప్ యాద‌వ్, ర‌వీంద్ర జ‌డేజాలు చెరో రెండు వికెట్లు తీశారు. బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. కీల‌క మైన 126 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం భార‌త్‌కు ల‌భించింది.

లంచ్ విరామం
మూడో రోజు ఆట‌లో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 290 ప‌రుగులు చేసింది. బెన్‌స్టోక్స్ (39), బెన్ ఫోక్స్ (6) లు క్రీజులో ఉన్నారు.

బెన్‌డ‌కెట్ ఔట్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్‌యాద‌వ్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో బెన్‌డ‌కెట్‌ (153; 151 బంతుల్లో 23 ఫోర్లు, 2సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 50.1వ ఓవ‌ర్‌లో 260 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (20), బెన్‌ఫోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు.

బెన్‌డ‌కెట్ 150 ప‌రుగులు.. 
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి బెన్ డ‌కెట్ 150 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. 45 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 243 4. డ‌కెట్ (150), బెన్‌స్టోక్స్ (6) లు క్రీజులో ఉన్నారు.

ఆరంభ‌మైన మూడో రోజు ఆట‌
ఓవ‌ర్ నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట కొన‌సాగించిన ఇంగ్లాండ్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జో రూట్‌ను బుమ్రా, జానీ బెయిర్ స్టోను కుల్దీప్ యాద‌వ్‌లు ఔట్ చేశారు. దీంతో 225 ప‌రుగుల‌కు ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. బెన్‌డ‌కెట్ (142), బెన్‌స్టోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు.