IND vs ENG 3rd T20I: ఆదిలోనే ఎదురుదెబ్బ.. 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. 5.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 24 స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (11), రిషబ్ పంత్ (7) నాటౌట్‌గా కొనసాగుతున్నారు.

IND vs ENG 3rd T20I: ఆదిలోనే ఎదురుదెబ్బ.. 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

Ind Vs Eng India Lost 3 Wickets In 3rd T20i

Updated On : March 16, 2021 / 7:49 PM IST

IND vs ENG 3rd T20I  : ఐదు టీ20ల సిరీస్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత స్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మొదట ఓపెనర్లుగా బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 15 పరుగులకే చేతులేత్తేశాడు.

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. 5.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 24 స్కోరు వద్ద 3 వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (11), రిషబ్ పంత్ (7) నాటౌట్‌గా కొనసాగుతున్నారు.


8 ఓవర్లు ముగిసేరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 38 పరుగులతో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఓపెనర్లలో వుడ్ రెండు వికెట్లు తీసుకోగా జార్దన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ సిరీస్ మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో టీ20 మ్యాచ్ లో కోహ్లీసేన విజయం సాధించింది.