IND vs ENG : బుమ్రా వండర్ రికార్డ్.. టాప్ 10 లిస్టులో ఆ ఇద్దరే బౌలర్లు..!
భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన బౌలర్‌గా సత్తా చాటాడు.

Ind Vs Eng Jasprit Bumrah Did Wonders By Bowling 1 Over
IND vs ENG : భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన బౌలర్‌గా సత్తా చాటాడు. కేవలం మూడు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మెయిడిన్ ఓవర్ బౌల్ వేయడంతో T20 క్రికెట్ హిస్టరీలోనే బుమ్రా రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా 58 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్ ఓవర్లు వేయగా.. రెండవ పేరు జర్మనీకి చెందిన గులామ్ అహ్మద్ నిలిచాడు.
గులామ్ 23 మ్యాచ్‌లలో 7 మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ వేశాడు. బుమ్రా 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ టీ20 క్రికెట్ హిస్టరీలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన టాప్ 10 బౌలర్లలో ఇద్దరు భారతీయులే ఉన్నారు. ఇప్పుడు బుమ్రాతో పాటు మరో భారత బౌలర్ హర్భజన్ సింగ్ ఉన్నాడు. హర్భజన్ 8వ స్థానంలో ఉన్నాడు. హర్భజన్ 28 మ్యాచుల్లో 5 మెయిడిన్ ఓవర్లు వేశాడు. బుమ్రా 58 టీ20 మ్యాచ్‌లలో 207.5 ఓవర్లు బౌల్ చేశాడు.

Ind Vs Eng Jasprit Bumrah Did Wonders By Bowling 1 Over
మొత్తం 1343 పరుగులు ఇచ్చిన అతడు మొత్తం 69 వికెట్లు తీశాడు. అలాగే 11 పరుగులకు 3 వికెట్లు మాత్రమే ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్‌లను సైతం బుమ్రా మట్టికరిపించాడు. తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వగా.. తన బ్యాట్‌తో కూడా ఆకట్టకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా నాటౌట్‌గా నిలిచి 31 పరుగులు చేశాడు.
? team effort today to go 2️⃣-0️⃣ up in the series ? pic.twitter.com/kcM56wEkRJ
— Jasprit Bumrah (@Jaspritbumrah93) July 9, 2022
Read Also : Ind vs Eng: ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదో టెస్టు రద్దు