IND vs NZ Odi Series 2026 : కివీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్‌షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్.. ధ్రువ్ జురెల్‌కు చోటు

IND vs NZ Odi Series 2026 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్ జరగనున్న వేళ టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు.

IND vs NZ Odi Series 2026 : కివీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్‌షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్.. ధ్రువ్ జురెల్‌కు చోటు

Rishabh Pant

Updated On : January 11, 2026 / 11:31 AM IST
  • నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే 
  • గాయం కారణంగా సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్
  • పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ

IND vs NZ Odi Series 2026 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే ఆదివారం మధ్యాహ్నం వడోదరలో జరగనుంది. అయితే, తొలి మ్యాచ్‌కు ముందే టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. కివీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.

Also Read : Shubman Gill : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన శుభ్‌మ‌న్ గిల్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డం పై

న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతనికి బంతి బలంగా తగలడంతో గాయమైంది. దీంతో తీవ్ర నొప్పితో పంత్ ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో మైదానంలో ఉన్న ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పంత్ గాయంపై ఆరా తీశారు. వైద్య బృందం ప్రాథమిక చికిత్స తరువాత రిషబ్ పంత్ స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మైదానంలోనే చర్చలు జరిపినట్లు ఓ వీడియో వైరల్ అయింది. పంత్‌కు తీవ్రమైన గాయం కావడంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది.


బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం వడోదరలోని బీసీఎ స్టేడియంలో భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనికి తీవ్రమైన గాయమైంది. వెంటనే అతన్ని బీసీసీఐ వైద్య బృందం ఎంఆర్ఐ స్కాన్ నిమిత్తం తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. అతడికి ‘సైడ్‌ స్ట్రెయిన్‌’ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో అతను కోలుకోవటానికి సమయం పడుతుందని వైద్యులు నిర్దారించడంతో కివీస్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ నుంచి పంత్‌ను తొలిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది.


ధ్రువ్ జురెల్ చేరిక తర్వాత భారత వన్డే జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌వాల్, యషా జవాల్.