Sourav Ganguly : ఇప్పటికైనా మేల్కొ.. వెంటనే ఆ పని చేయ్.. గంభీర్‌కు సౌరవ్ గంగూలీ సూచన..
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక సూచన చేశాడు.
IND vs SA 1st Test Sourav Ganguly Sends Blunt Message To Gautam Gambhir
Sourav Ganguly : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమ్ఇండియా ఓటమిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక సూచన చేశాడు.
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అదే సమయంలో పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లపై నమ్మకం ఉంచాలన్నాడు. నిజం చెప్పాలంటే తనకు గంభీర్ అంటే ఎంతో ఇష్టమన్నాడు. అతడు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లలో అద్భతంగా ఆడాడడన్నారు. అతడు ఇంకొన్నేళ్ల పాటు హెడ్ కోచ్‌గా ఉండాడని గంగూలీ జోస్యం చెప్పాడు.
IND vs SA : పుజారాకు కోపమొచ్చింది.. స్వదేశంలో ఓడిపోతారా ? ఆ పని చేసుంటే గెలిచేవాళ్లం కదా!
స్వదేశంలో టీమ్ఇండియా మ్యాచ్‌లు ఆడే సమయంలో గంభీర్ మంచి పిచ్‌లను ఎంచుకోవాలని సూచించాడు. ప్రస్తుత టెస్టు జట్టులో షమీకి చోటు ఉంటే బాగుందని అనుకుంటున్నానని అన్నాడు. ఇక బ్యాటర్లు 350 నుంచి 400 పరుగులు చేయలేకపోతే భారత జట్టు మ్యాచ్‌లను గెలవలేదన్నాడు.
ఇక ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా బ్యాటర్లు భారీగా పరుగులు సాధించారని, అందుకనే అక్కడ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించామన్నాడు. ఇక టెస్టు మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరిగేలా పిచ్‌లను ఎంచుకోవాలని, మూడు రోజుల్లోనే ముగిసేలా కాదన్నాడు.
Shubman Gill : ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు స్వల్ప ఊరట..
చివరిసారిగా షమీ టీమ్ఇండియా తరుపున 2023లో టెస్టు మ్యాచ్ ఆడాడు. అతడిని ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. షమీ ఫిట్‌నెస్‌కు సంబంధించి తమకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతోనే జట్టులోకి తీసుకోవడం లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేసిన సమయంలో అన్నాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్ అయిన రంజీల్లో షమీ అదరగొడుతున్నాడు. ఇటీవల జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో 115 ఓవర్లు వేసి 17 వికెట్లు తీశాడు.
