IND vs WI : టీమ్ఇండియాకు భారీ షాక్.. గాయపడిన సాయిసుదర్శన్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని.. వీడియో వైరల్
విండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs WI) భారత స్టార్ ఆటగాడు సాయి సుదర్శన్ గాయపడ్డాడు.

IND vs WI 2nd Test Sai Sudharsan gets injured after taking blinder of a catch
IND vs WI : ఢిల్లీ వేదికగా వెస్డిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టీమ్ఇండియా యువ ఆటగాడు సాయిసుదర్శన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి చిటికెన వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానం నుంచి నిష్ర్కమించాడు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని విండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (10) స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్‌కు బాల్ కనెక్ట్ అయింది. అయినప్పటికి బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ చేతుల్లోకి వెళ్లింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా సుదర్శన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.
బంతి అతడి కుడి చేతి చిటికెన వేలిని తాకింది. అయినప్పటికి సుదర్శన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ను చూసిన జాన్ కాంప్‌బెల్ షాకైయ్యాడు. తరువాత తేరుకుని మైదానం నుంచి నిష్ర్కమించాడు. దీంతో విండీస్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
క్యాచ్ అందుకున్న తరువాత సుదర్శన్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. పడిక్కల్ ప్రత్నామ్నాయ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు.
కాగా.. సుదర్శన్ క్యాచ్ అందుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SAI SUDHARSAN WITH A SPECTACULAR CATCH. 🤯pic.twitter.com/OsWITs9vIH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2025
అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) భారీ శతకాలు బాదారు. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ చేశాడు. ధ్రువ్ జురెల్ (44), నితీశ్‌కుమార్ రెడ్డి (43), కేఎల్ రాహుల్ (38)లు రాణించారు.