ధోనీ రికార్డుతో పాటు మరిన్ని దక్కించుకున్న రో’హిట్’ శర్మ

ధోనీ రికార్డుతో పాటు మరిన్ని దక్కించుకున్న రో’హిట్’ శర్మ

Updated On : November 8, 2019 / 8:04 AM IST

తొలి టీ20 పరాజయం తర్వాత ఒత్తిడిలో కూరుకున్న భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు రోహిత్ శర్మ. వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు చేధనలో జట్టుకు శక్తిగా మారాడు. 154పరుగుల లక్ష్య చేధనను సునాయాసంగా తిప్పికొట్టాడు. 23బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. 43బంతుల్లో 85పరుగులు చేయగలిగాడు. 

రాజ్ కోట్ వేదికగా జరిగే మ్యాచ్ కు తుఫాన్ ఆటంకం ఉందని వచ్చిన వార్తలకు రోహిత్ తన బ్యాట్‌తోనే పరుగుల తుఫాన్ కురిపించాడు. బంగ్లా ఆఫ్ స్పిన్నర్ మొసద్దిక్ హుస్సేన్ బౌలింగ్ కు వచ్చీరాగానే రోహిత్ మొదటి మూడు బంతులను సిక్సులుగా మలిచాడు. దీంతో అతనిపేరిట కొత్త రికార్డులు వచ్చి చేరాయి. మ్యాచ్ మొత్తంలో 6సిక్సులు బాదడంతో టీ20క్రికెట్లో అత్యధిక సిక్సులు(34) బాదిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. 

ఈ రికార్డు సాధించడానికి మహేంద్ర సింగ్ ధోనీ 62ఇన్నింగ్స్ లు తీసుకోగా, రోహిత్ 17ఇన్నింగ్స్ లలోనే 37 సిక్సులు చేయగలగడం విశేషం. ఈ జాబితాలో కోహ్లీ 26ఇన్నింగ్స్ లలో 26సిక్సులు బాది మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్ గా పేరున్న రోహిత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. కెప్టెన్ గా టీ20ల్లో ఎక్కువ సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌ సాధించింది కోహ్లీ, రోహిత్ లు మాత్రమే.