IND vs ENG 4th test : శ‌త‌క్కొట్టిన రూట్‌.. ముగిసిన తొలి రోజు ఆట‌

నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది.

IND vs ENG 4th test : శ‌త‌క్కొట్టిన రూట్‌.. ముగిసిన తొలి రోజు ఆట‌

IND vs ENG 4th Test

ముగిసిన తొలి రోజు ఆట‌
రాంచీ వేదిక‌గా భారత్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ జ‌ట్టు ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 302 ప‌రుగులు చేసింది. జోరూట్ (106), ఓలి రాబిన్స‌న్ (31) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆకాశ్‌దీప్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్ రెండు, జ‌డేజా, అశ్విన్‌లు చెరో వికెట్ తీశారు.

జోరూట్ సెంచ‌రీ..
ఎట్ట‌కేల‌కు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జోరూట్ ఫామ్ అందుకున్నాడు. భార‌త్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లో తొలి సారి మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 219 బంతుల్లో 9 ఫోర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 84 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 279/7. జోరూట్ (103), ఓలి రాబిన్స‌న్ (12) లు క్రీజులో ఉన్నారు.

టామ్ హార్డ్లీ క్లీన్‌బౌల్డ్..
టీ విరామం త‌రువాత మ‌హ్మ‌ద్ సిరాజ్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌మాక‌రంగా మారిన బెన్‌ఫోక్స్‌-రూట్ భాగ‌స్వామ్యాన్ని విడ‌గొట్టాడు. మొద‌ట బెన్‌ఫోక్స్ (47)ను ఔట్ చేసిన సిరాజ్ కాసేప‌టికే టామ్‌హార్డ్లీ(13)ని పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 75.3 వ ఓవ‌ర్‌లో 245 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

టీ బ్రేక్‌.. 
తొలి రోజు టీ విరామ స‌మ‌యానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. జోరూట్ (67), బెన్‌ఫోక్స్ (28) లు క్రీజులో ఉన్నారు.

జో రూట్ అర్ధ‌శ‌త‌కం..
ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 108 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్. 50 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 176/5. రూట్ (50), బెన్‌ఫోక్స్ (24) లు క్రీజులో ఉన్నారు.


లంచ్ బ్రేక్‌..
నాలుగో టెస్టు మొద‌టి రోజు ఆట‌లో లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు చేసింది. జోరూట్ (16) క్రీజులో ఉన్నాడు. అంత‌క‌ముందు బెయిర్ స్టో (38) ను అశ్విన్ ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేయ‌గా బెన్‌స్టోక్స్‌(3)ను జ‌డేజా ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేర్చాడు.

జాక్‌క్రాలే క్లీన్‌బౌల్డ్‌..
అరంగ్రేట టెస్టులో ఆకాశ్‌దీప్ రెచ్చిపోతున్నాడు. జాక్‌క్రాలేను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 11.5వ ఓవ‌ర్‌లో 57 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. కాగా.. ఇంగ్లాండ్ కోల్పోయిన అన్ని వికెట్లు ఆకాశ్‌దీపే ప‌డ‌గొట్ట‌డం విశేషం.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన అరంగ్రేట బౌల‌ర్ ఆకాశ్‌దీప్‌
అరంగ్రేట బౌల‌ర్ ఆకాశ్‌దీప్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్‌ను ఆకాశ్ వేశాడు. రెండో బంతికి బెన్‌డ‌కెట్ (11) ఔట్ చేసిన ఆకాశ్.. నాలుగో బంతికి ఓలీపోప్ (0) ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేర్చాడు. 10 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 47/2. జోరూట్‌ (0), జాక్ క్రాలీ (35) లు క్రీజులో ఉన్నారు.

భారత తుది జ‌ట్టు : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్ కీప‌ర్‌), టామ్ హార్ట్లీ, ఒలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

IND vs ENG : రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో భార‌త్ 2-1 ఆధిక్యంలో ఉండ‌డంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ఇంగ్లాండ్ భావిస్తోంది. టీమ్ఇండియా తుది జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఈమ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వ‌డంతో ఆకాశ్ దీప్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు.