India vs New Zealand: న్యూజిలాండ్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చిన టీమిండియా

తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238గా నమోదైంది.

India vs New Zealand: న్యూజిలాండ్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చిన టీమిండియా

India vs New Zealand (Image Credit To Original Source)

Updated On : January 21, 2026 / 9:09 PM IST
  • నాగ్‌పూర్‌లో తొలి టీ20
  • తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా
  • స్కోరు 20 ఓవర్లలో 238/7  

India vs New Zealand: ఇండియా, న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238గా నమోదైంది. అభిషేక్ శర్మ (84), రింకూ సింగ్ 44 (నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

Also Read: Abbas : ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ రీ ఎంట్రీ అదిరిందిగా.. ‘హ్యాపీ రాజ్’ ప్రోమో రిలీజ్..

భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 84, ఇషాన్ కిషన్ 8, సూర్యకుమార్ యాదవ్ 32, హార్దిక్ పాండ్యా 25, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 44 (నాటౌట్), అక్షర్ పటేల్ 5, అర్ష్‌దీప్ సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు.

జాకబ్ డఫీ, కైల్ జేమిసన్ రెండేసి వికెట్లు, క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.