T20 World Cup 2022: టీమిండియా ముందు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పాకిస్థాన్
టీమిండియా ముందు పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ లో షాన్ మసూద్ 52 (నాటౌట్), ఇఫ్తిఖర్ అహ్మద్ 51 పరుగులతో రాణించారు.

T20 World Cup 2022: టీమిండియా ముందు పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ లో షాన్ మసూద్ 52 (నాటౌట్), ఇఫ్తిఖర్ అహ్మద్ 51 పరుగులతో రాణించారు.
మిగతా బ్యాట్స్ మెన్ లో షాహీన్ అఫ్రిది 16 తప్ప మిగతా ఎవ్వరూ కనీసం రెండు అంకెల పరుగులు చేయలేకపోయారు. ఇతర బ్యాట్స్ మెన్ వికెట్లు వెనువెంటనే పడుతున్నప్పటికీ షాన్ మసూద్ 52 (నాటౌట్), ఇఫ్తిఖర్ అహ్మద్ 51 నిలకడగా రాణించడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, షమీకి ఒక్కో వికెట్ దక్కాయి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..