టెస్టు సిక్సుల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

టెస్టు సిక్సుల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

Updated On : October 19, 2019 / 10:21 AM IST

రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు. గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్‌లో 15సిక్సులతో ఉన్న రికార్డు 17 సిక్సులతో దాటేశాడు. 

2010లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఒక సంవత్సరంలో 14 పరుగులు చేసిన రికార్డు హర్భజన్ సింగ్ పేరిటా ఉంది. ఆ సిరీస్‌లో భజ్జీ రెండు సెంచరీలు చేసిన ఘనత ఉంది. అప్పటి నుంచి మరే భారత క్రికెటర్ చేయలేనన్ని సిక్సులతో రోహిత్ టాప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ తొలి రోజును విజయవంతంగా పూర్తి చేశాడు. ఆరంభంలోనే వికెట్లు పడిపోయినా రహానెతో కలిసి జట్టుకు పరుగులు జోడించాడు. తొలి రోజు స్టంప్స్ ప్రకటించిన సమయానికి రోహిత్ శర్మ(117; 14ఫోర్లు, 4సిక్సులు), అజింకా రహానె(83; 11ఫోర్లు, 1సిక్సు)తో క్రీజులో ఉన్నారు.