భారత్ బోణీ.. ఏడు వికెట్ల తేడాతో కొట్టేశారు

భారత్ బోణీ.. ఏడు వికెట్ల తేడాతో కొట్టేశారు

Updated On : January 7, 2020 / 5:18 PM IST

తొలి మ్యాచ్ రద్దు అయినా.. రెండో మ్యాచ్‌తో భారత్ హిట్ కొట్టేసింది. లంకపై మూడు విభాగాల్లోనూ రాణించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇండోర్ వేదికగా తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ తక్కువ పరుగులకే లంకేయులను కట్టడి చేసి మూడు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్నిదక్కించుకుంది. 

లంక విసిరిన 143 పరుగుల టార్గెట్‌ను ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత విజయంలో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు) కీలక పాత్ర పోషించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 71 పరుగులు జోడించడంతో ఇండియా సునాయాసంగా గెలుపొందింది. 

శ్రేయాస్ అయ్యర్ (34)పరుగులు చేసి అవుట్ అవగా రిషబ్ పంత్(1)మరో ఎండ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (30 నాటౌట్) మ్యాచ్ ముగించారు. అంతకంటే ముందు భారత బౌలర్లు విజృంభించడంతో లంక ఆటగాళ్లు తేలిపోయారు. కుశాల్ పెరీరా (34) మినహా మిగిలిన ఆటగాళ్లంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.

టీమిండియా బౌలర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ (3/23) ధాటికి లంక ఆటగాళ్లు చేతులేత్తేశారు. నవదీప్ సైని తన పేస్ బౌలింగ్‌తో శ్రీలంక ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తాను వేసిన 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

అవిష్కా ఫెర్నాండో (22), ఓపెనర్ గుణతిలక (20), డి సెల్వా (17), హసరంగ (16 నాటౌట్), ఒషాడా ఫెర్నాండో (10), రాజపాక్సా (7), ఉదానా (1), పరుగులు చేయగా, మలింగ పరుగులేమి చేయకుండానే నిష్ర్కమించగా, , కుమార (0 నాటౌట్)గా నిలిచాడు.

భారత బౌలర్లలో అత్యధికంగా శార్దూల్ ఠాకూర్ (3/23) వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ (2/38), నవదీప్ సైని (2/18) తలో రెండు వికెట్లు, బుమ్రా (1/32) వాషింగ్టన్ సుందర్ (1/29) తలో వికెట్ తీశారు.  వాషింగ్టన్ సుందర్ 2020లో తొలి వికెట్ తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.