IND vs SL : ఇండియా vs శ్రీలంక.. హెడ్ టు హెడ్ రికార్డ్స్..
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది.

IND vs SL
India vs Sri Lanka : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆడిన ఆరు మ్యాచుల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఓటమే ఎగురని జట్టుగా ఇప్పటి వరకు ఉంది. ఈ క్రమంలో మరో పోరుకు సిద్ధమైంది. వాంఖడే వేదికగా గురువారం శ్రీలంక జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీ పైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలవాలని రోహిత్ సేన భావిస్తోంది.
అటు శ్రీలంక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆరు మ్యాచులు ఆడిన లంక రెండు మ్యాచుల్లో గెలిచి నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే మాత్రం భారత్‌ను ఓడించాల్సి పరిస్థితి ఉంది. ఒకవేళ టీమ్ఇండియా చేతిలో లంక ఓడిపోతే మాత్రం సెమీస్ ఆశలను వదులుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో లంకకు ఇది చావో రేవో మ్యాచ్ కానుంది. అయితే.. శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
వన్డేల్లో మనదే ఆధిపత్యం..
వన్డేల్లో భారత్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు 167 సార్లు తలపడ్డాయి. ఇందులో 98 మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా, శ్రీలంక 57 మ్యాచుల్లో గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగియగా, మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. చివరి సారి తలపడిన ఐదు సందర్భాల్లో భారత్‌నే విజయం వరించడం విశేషం. ఇందులో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను 50 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. సిరాజ్ ఆరు వికెట్లు తీసి లంకను గట్టి దెబ్బతీశాడు.
ప్రపంచకప్ రికార్డు ఎలాగుందంటే..?
వన్డేల్లో మనదే స్పష్టమైన ఆధిపత్యం అయినప్పటికీ మెగా టోర్నీల్లో మాత్రం అలాలేదు. ప్రపంచకప్‌లో శ్రీలంక గట్టి పోటీనిచ్చింది. ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డే ప్రపంచకప్ చరిత్రలో 9 సార్లు తలపడగా చెరో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇది చాలు ప్రపంచకప్‌లలో శ్రీలంక ఎంత ప్రమాదకారో అని చెప్పడానికి. బ్యాటింగ్‌లో పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ మంచి ఫామ్‌లో ఉన్నారు. మధుశంక, వెల్లలాగే, కసున్ రజిత, తీక్షణ కూడిన బౌలింగ్ లైనప్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. వీళ్లందరికి ఉపఖండ పిచ్‌లు బాగా అలవాటు అన్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా కాస్త ఏమరుపాటుగా ఉన్నా గట్టి షాక్ తగలక తప్పదు.
Glenn Maxwell : ఆస్ట్రేలియాకు భారీ షాక్.. గోల్ఫ్ ఆడుతూ గాయపడిన మాక్స్‌వెల్..