Asian Games 2023: పతకం ఖాయమైంది.. బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ జట్టు
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. చివరికి రెండు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.

India Women Cricket team
India vs Bangladesh Womens Cricket : ఆసియా క్రీడలు 2023లో భాగంగా మహిళల క్రికెట్‌లో భారత్ మహిళల జట్టు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఆదివారం బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మెగా ఈవెంట్ ఫైనల్లోకి భారత్ జట్టు అడుగుపెట్టింది. మరోవైపు భారత్ జట్టు ఫైనల్ కు చేరడంతో పతకం ఖాయమైంది. ఫైనల్ లో విజయం సాధిస్తే భారత్ మహిళా జట్టుకు స్వర్ణ పతకం లభిస్తుంది. సోమవారం (సెప్టెంబర్ 25) జరగనున్న ఫైనల్‌లో శ్రీలంక లేదా పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
BAN vs NZ : ఔటైన బ్యాటర్‌ను వెనక్కి పిలిచారు.. మరోసారి నెట్టింట మన్కడింగ్ రచ్చ
బంగ్లాదేశ్ – భారత్ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 51 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత్ బౌలర్ పూజా వస్త్రాకర్ 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, టిటాస్ సాధు, రాజేశ్వరి గయాక్వాడ్, అమంజోత్ కౌర్, దేవిక వైద్య తలాఒక వికెట్ తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోర్ గా నిలిచింది.
MS Dhoni : ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు.. ధోనీ, మోహన్‌లాల్.. పిక్ వైరల్
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (7), షఫాలీ వర్మ (17) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జేమీమా రోడ్రిగ్స్ (20), కనికా (1) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. కేవలం 8.5 ఓవర్లలోనే భారత్ జట్టు లక్ష్యాన్ని చేధించింది.

India vs Bangladesh Womens Cricket