భారత్ Vs పాక్ : బీసీసీఐ చెప్పిందే చేస్తామంటోన్న కోహ్లీ

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది.

భారత్ Vs పాక్ : బీసీసీఐ చెప్పిందే చేస్తామంటోన్న కోహ్లీ

Updated On : February 23, 2019 / 9:25 AM IST

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది.

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మేర సమావేశంలో పాల్గొన్న కోహ్లీ మీడియాతో ముచ్చటించారు. ముందుగా ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ గురించి ఏమంటారని అడిగిన ప్రశ్నకు.. బదులుగా ‘ప్రభుత్వ నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నాం. ప్రభుత్వం బీసీసీఐకి చెప్పిన దానిని బట్టి సిద్ధమవుతాం’ అని పేర్కొన్నాడు. 
Read Also: భారత్-పాక్ మ్యాచ్ వాళ్ల ఇష్టమే: కపిల్ దేవ్  

‘పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. దేశం ఏం కోరుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాం. బీసీసీఐ ఏం చెప్తే అదే చేస్తాం. ప్రభుత్వం, బోర్డు చెప్పిందే చేసేందుకు సిద్ధమైయ్యాం. వారి నిర్ణయాలను గౌరవిస్తాం’ అని వెల్లడించాడు.

ఇదే విషయంపై చర్చల అనంతరం బీసీసీఐ.. ఐసీసీకి ఉగ్రదాడి జరిగిన విధానం గురించి, దాని వల్ల జరిగిన నష్టం గురించి లేఖ ద్వారా తెలపనున్నట్లు వివరించారు. అయితే భారత్.. పాక్ మ్యాచ్ జరగకూడదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌లు అభిప్రాయపడ్డారు. వీరికి విరుద్ధంగా కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్‌లు మ్యాచ్ జరగాలని పాక్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. 
Read Also: తేజస్ యుద్ధ విమానంలో పీవి సింధు