ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి తెలుసుకోవలసినవి

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి తెలుసుకోవలసినవి

ఐపీఎల్ 2018 సీజన్‌ను లీగ్ పట్టికలో ఆఖర్లో ముగించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా 2019 సీజన్‌కు అడుగుపెట్టనుంది. ఐపీఎల్ 2019వేలానికి ముందే పేరు మార్చుతున్నట్లు ప్రకటించిన జట్టులో సీజన్‌కు కీలక మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. జీఎమ్మార్ గ్రూపు, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ల భాగస్వామ్యంతో యాజమాన్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
Read Also : తొలి 5 ఓవర్లలోనే ధావన్ వికెట్ ఫట్

మొదటి 2 ఎడిషన్‌లకు సెమీ ఫైనల్స్ వరకూ చేరిన ఢిల్లీ.. ఆ తర్వాత ప్రతి సీజన్‌లోనూ లీగ్ పట్టికలో చివరి స్థానంలోనే కొనసాగుతోంది. 2018లో తమ రాతను మార్చుకోవాలని ప్రయత్నించి గౌతం గంభీర్‌ను కెప్టెన్ గా నియమించి ఘోరంగా ఫెయిలైంది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ బాధ్యతలు భుజాన వేసుకున్నప్పటికీ అంతగా రాణించలేకపోయాడు. ఈ సారి ఐపీఎల్ కు మాత్రం సన్ రైజర్స్ జట్టు నుంచి హిట్టర్ శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకుని కీలక మార్పులు చేసింది.

బలాలు:
టీమిండియా యువ క్రికెటర్లు అయిన పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు జట్టును మరో దశాబ్దం వరకూ నడిపించగల సత్తా ఉన్నోళ్లు. దీంతో పాటు శిఖర్ ధావన్ తోడైతే.. ఢిల్లీ జట్టుకు అనుభవంతో పాటు హిట్టింగ్ కు కూడా కొదవ లేదు. ఇంకా జట్టులో కొలిన్ మున్రో, కొలిన్ ఇంగ్రామ్‌లు మరో ఇద్దరు విదేశీ స్టార్ ప్లేయర్లు ఉండటం మరింత బలాన్ని చేకూర్చుతోంది.

బలహీనతలు:
ఢిల్లీ జట్టుకు సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 2010 నుంచి ఆ జట్టు కోలుకున్నట్లుగానే కనిపించడం లేదు. అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్‌ల అనుభవం జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసుకున్న సందీప్ లామ్‌చనే కూడా జట్టును ఏ విధంగానూ ఆదుకోలేకపోతున్నాడు.  

కోచ్: రిక్కీ పాంటింగ్

జట్టు మొత్తంగా:
శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తేవాతియా. మన్జోత్ కల్రా, కొలిన్ మన్రో, క్రిస్ మొర్రిస్, కగిసో రబాడ, సందీప్ లామించనే, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ ఇంగ్రామ్, అక్సర్ పటేల్, హనుమ విహారీ, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, ఇషాంత్ శర్మ, కీమో పాల్, జలజ్ సక్సేనా, అంకుష్ బైనస్, నాతు సింగ్, బండారు అయ్యప్ప

షెడ్యూల్:
మ్యాచ్ 1:
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మార్చి 24, ముంబైలోని వాంఖడే స్టేడియంలో..
మ్యాచ్ 2: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 26, ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో ..
మ్యాచ్ 3: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మార్చి 30, ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో ..
మ్యాచ్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏప్రిల్ 01, మొహాలీలోని బింద్రా స్డేడియంలో.. 
మ్యాచ్ 5: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 04, ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో ..
Read Also : కట్టడి చేసిన భారత్.. ఆస్ట్రేలియా స్కోరు 272