బిగ్ ఫైట్ : IPL ఫైనల్ చెన్నైలోనే

బిగ్ ఫైట్ : IPL ఫైనల్ చెన్నైలోనే

అంతర్జాతీయంగా క్రికెట్‌లో అత్యంత ధనిక దేశీవాలీ లీగ్‌గా పేరొందిన లీగ్ ఐపీఎల్. రానున్న సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులను మరింత ఊరిస్తోంది బీసీసీఐ. డిఫెండింగ్ ఛాంపియన్ సొంతగడ్డపైనే మ్యాచ్ జరగడం ఆనవాయితీగా వస్తున్నా.. ఎన్నికల నేపథ్యంలో ఈ సారి ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగదంటూ వార్తలు వచ్చాయి. ఈ అనుమానాలన్నింటికీ తెరదించుతూ బీసీసీఐ అధికారి ఒకరు వేదిక గురించి నిర్దారించారు. 

‘ఏ సందేహం లేకుండా ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలోనే నిర్వహిస్తాం. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయగా తుది షెడ్యూల్ విడుదల చేయడానికి ఎన్నికల షెడ్యూల్‌లో ఆలస్యమవడమే కారణం. దానిని బట్టి మ్యాచ్ తేదీలు, సమయాలలో మార్పులు చేసి తుది షెడ్యూల్ వివరాలను తర్వాత ప్రకటిస్తాం. ఇప్పటికే ఎన్నికల కారణంగా ఐపీఎల్ మొత్తాన్ని యూఏఈకి మార్చనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2014లోనూ యూఏఈ వేదికగా, 2009లో దుబాయ్ వేదికగా ఐపీఎల్ ను నిర్వహించారు. 

పాత షెడ్యూల్ ప్రకారం.. మార్చి 23నుంచి ఐపీఎల్ 2019 ఆరంభం కావాల్సి ఉంది. ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం.. గత సీజన్‌లో గెలిచిన జట్టు సొంతగడ్డపైనే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ సీజన్ లో ఛైర్మన్ లేకుండానే జరగడం ఇదే తొలిసారి. 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది