మస్తు మజా : 20-20 యుద్ధం ప్రారంభం
సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న

సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న
సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మ్యాచ్ లు మరికొన్ని గంటల్లో మొదలు కాబోతున్నాయి. నెలన్నరపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 12వ సీజన్ సిద్ధమైంది. శనివారం (మార్చి 23, 2019) నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకాబోతున్నాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కి చెపాక్‌లోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
ఐపీఎల్ 2019 సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రతి జట్టూ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై.. మరో 7 మ్యాచుల్ని ప్రత్యర్థి వేదికలపై ఆడనున్నాయి. శనివారం (మార్చి 23) ఆరంభంకానున్న లీగ్ దశ మే 5 వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ జరగనున్నాయి. మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8గంటలకి ప్రారంభంకానున్నాయి.
2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 11 సీజన్లు పూర్తవగా.. చెన్నై, ముంబయి జట్లు 3 సార్లు విజేతగా నిలిచాయి. కోల్‌కతా 2 సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్, డక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్‌ను గెలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాయి. దీంతో విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
ఐపీఎల్‌లో పోటీపడుతున్న జట్లు:
1. చెన్నై సూపర్ కింగ్స్
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
3. సన్‌రైజర్స్ హైదరాబాద్
4. ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుంది)
5. కింగ్స్ ఎలెవన్ పంజాబ్
6. రాజస్థాన్ రాయల్స్
7. కోల్‌కతా నైట్‌రైడర్స్
8. ముంబయి ఇండియన్స్
హైదరాబాద్ లో జరిగే మ్యాచ్‌లు:
మార్చి 29 : రాజస్థాన్‌తో (రాత్రి 8గం.)
మార్చి 31 : బెంగళూరుతో (సాయంత్రం 4గం.)
ఏప్రిల్ 6 : ముంబైతో (రాత్రి 8గం.)
ఏప్రిల్ 14 : ఢిల్లీతో (రాత్రి 8గం.)
ఏప్రిల్ 17 : చెన్నైతో (రాత్రి 8గం.)
ఏప్రిల్ 21 : కోల్‌కతాతో (సాయంత్రం 4గం.)
ఏప్రిల్ 29 : పంజాబ్‌తో (రాత్రి 8గం.)
గత విజేతలు:
2018 – చెన్నై సూపర్ కింగ్స్
2017 – ముంబై ఇండియన్స్
2016 – సన్ రైజర్స్ హైదరాబాద్
2015 – ముంబై ఇండియన్స్
2014 – కోల్‌కతా నైట్ రైడర్స్
2013 – ముంబై ఇండియన్స్
2012 – కోల్‌కతా నైట్ రైడర్స్
2011 – చెన్నై సూపర్ కింగ్స్
2010 – చెన్నై సూపర్ కింగ్స్
2009 – డెక్కన్ ఛార్జర్స్
2008 – రాజస్థాన్ రాయల్స్