IPL 2019 మధ్యలో ఉమెన్స్ ఐపీఎల్

IPL 2019 మధ్యలో ఉమెన్స్ ఐపీఎల్

Updated On : February 25, 2019 / 1:07 PM IST

ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) అంటే దేశీ వాలీ లీగ్ మాత్రమే కాదు. అంతర్జాతీయ క్రికెట్ కూడా అదొక సంచలనం. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల కంటే ఐపీఎల్ మ్యాచ్‌లకే ఎక్కువ క్రేజ్.. దేశ విదేశాల స్టార్ ప్లేయర్లంతా తమ సత్తా నిరూపించుకునేందుకు పోటీపడుతుంటారు. బౌండరీలే హద్దుగా రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్, రెప్పపాటు గ్యాప్‌లో స్టంపౌట్ ల కోసం ఎదురుచూసే కీపర్లు, సమయం చూసి బౌలింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేసేందుకు ప్రయత్నించే బౌలర్లు. ఇలా మ్యాచ్ చూస్తున్నంత సేపు ప్రతి క్షణం ఉత్కంఠే. చివరి క్షణం వరకూ తేలని ఫలితాలతో ఆద్యంతం కట్టిపడేస్తుంటాయి. 

ఇలాంటి ఫార్మాట్‌లోకి.. ఇదే లీగ్‌లో మహిళలను ఆడిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది బీసీసీఐ. దీని కోసమే గతేడాదే ట్రయల్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడించింది. ఇదే క్రమంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా  సూపర్‌నోవాస్, ట్రయల్‌బ్లేజర్స్ జట్ల మధ్య జరిగిన 2 గంటలకు జరిగిన మ్యాచ్‌కు మంచి ఆదరణే లభించింది. దానికి కారణం ఆ రోజు సాయంత్రమే పురుషుల ఐపీఎల్ ఉండటమే. 
Read Also: INDvAUS: మ్యాచ్ ఓడినా కోహ్లీ రికార్డు

ఇదే అదనుగా భావించి మహిళా ఐపీఎల్‌ను నిర్వహించేందుకు సమయం కోసం ఎదురుచూస్తోంది బీసీసీఐ. ఇప్పటికే రెండు వారాల పాటు అంటే 17మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. ఇంకా పూర్తి షెడ్యూల్ ను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నిర్దారిస్తామని తెలియజేసింది. 

ఐపీఎల్ జరుగుతుండగా ప్లే ఆఫ్‌ల కోసం దొరికిన విరామ సమయంలో మహిళా ఐపీఎల్ నిర్వహించాలని అనుకుంటుందట. చివరిసారిగా జరిగిన ఐపీఎల్‌లో కేవలం మూడు రోజుల విరామం మాత్రమే దొరికింది. వాటిలో ప్లే ఆఫ్ కోసం 2 రోజులు, ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఒకరోజే.
Read Also: చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం