గతం గత: ఈసారి చూసుకుంటాం.. మాది బలమైన జట్టు: కోహ్లీ

  • Published By: vamsi ,Published On : September 10, 2020 / 06:49 AM IST
గతం గత: ఈసారి చూసుకుంటాం.. మాది బలమైన జట్టు: కోహ్లీ

Updated On : September 10, 2020 / 10:41 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్‌లో ఫైనల్ చేసినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.



రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే బలంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 2016 ఐపీఎల్‌లో బెంగళూరు ఫైనల్స్‌లో అడుగుపెట్టినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ మాట్లాడుతూ, ” టీ20కి అవసరమైన అనుభవం, నైపుణ్యాలు మరియు జట్టుకు బాధ్యత వహించడానికి అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునే యువత జట్టులో ఉందని కోహ్లీ అన్నారు.

“2016 సీజన్ మాకు మరపురాని సీజన్.. నిజం చెప్పాలంటే, ప్రస్తుత జట్టు అప్పటి నుంచి ఉన్న జట్లలో అత్యంత సమతుల్య జట్టు. ఈ జట్టుతో బాగా ముందుకు వెళ్తున్నాం. మైదానంలో వ్యూహాన్ని ఎలా అమలు చేస్తాం అనేది ఇప్పుడు మాపై ఉన్న బాధ్యత. ”



బెంగుళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది, కానీ మూడుసార్లు కూడా ఓడిపోయింది. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, “గతంలో ఏమి జరిగిందో వదిలేయండి. ఇప్పుడు మాత్రం మాకు చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్నారు. అంతేకాదు వారిని చూడడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ప్రజలు జట్టుపై చాలా అంచనాలను కలిగి ఉన్నారని అన్నారు.”