సెప్టెంబర్ 8 న యూఏఈకి గంగూలీ.. కారణం ఇదే!

  • Published By: vamsi ,Published On : September 4, 2020 / 07:28 AM IST
సెప్టెంబర్ 8 న యూఏఈకి గంగూలీ.. కారణం ఇదే!

Updated On : September 4, 2020 / 9:59 AM IST

BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెప్టెంబర్ 8 న దుబాయ్ బయలుదేరుతారు, ఫ్రాంఛైజీలకు SOP ని ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన దుబాయ్ వెళ్లనున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. SOPకి కట్టుబడి ఉండటం గురించి ఆయన అన్ని ఫ్రాంఛైజీలతో చర్చలు జరపపనున్నారు.



గంగూలీ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎబిపి న్యూస్‌తో మాట్లాడుతూ, ‘నేను సెప్టెంబర్ 8 న దుబాయ్ వెళ్తున్నాను. వివిధ ఫ్రాంచైజీల అధికారులతో SOP లను కఠినంగా అమలు చేయడం గురించి మరికొన్ని రకాల సమస్యలపై చర్చలు జరపనున్నట్లు చెప్పారు.
https://10tv.in/micheal-jackson-birth-anniversary-king-of-pops-india-influencial-connection/
ఐపీఎల్‌కు ముందు అంతా బాగానే జరుగుతుందా? ఆటగాళ్ళు బిసిసిఐ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తున్నారా? అనే విషయాలను చూడటానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దుబాయ్ చేరుకుంటున్నారు.



తాను సెప్టెంబర్ 8 న దుబాయ్ చేరుతున్నానని సౌరవ్ గంగూలీ చెప్పారు. దుబాయ్‌లో దాదా వివిధ ఫ్రాంచైజీల అధికారులతో మాట్లాడి తీసుకోవల్సిన చర్యలపై దిశా నిర్దేశం చెయ్యనున్నారు. గత రెండు రోజుల్లో, అరబ్ ఎమిరేట్స్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది.



బుధ, గురువారాల్లో అక్కడ 1249 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐపిఎల్ జాబితా రాకముందే, కరోనా పెరుగుతున్న కేసుల గురించి బిసిసిఐ ఆందోళన చెందుతోంది. అటువంటి పరిస్థితిలో, బోర్డు అధ్యక్షుడు స్వయంగా దుబాయ్ చేరుకుంటున్నారు.