IPL 2020, KXIP vs KKR : మ్యాచ్ ప్రీవ్యూ, పంజాబ్ జట్టులో భారీగా మార్పులు.. గెలుపు ఎవరిదీ?

  • Published By: vamsi ,Published On : October 10, 2020 / 03:02 PM IST
IPL 2020, KXIP vs KKR : మ్యాచ్ ప్రీవ్యూ, పంజాబ్ జట్టులో భారీగా మార్పులు.. గెలుపు ఎవరిదీ?

Updated On : October 10, 2020 / 3:23 PM IST

ipl 2020:ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో శనివారం(10 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. నేటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు ఎటువంటి మార్పు లేకుండా ఆడే అవకాశం కనిపిస్తుంది.

దుబాయ్‌లోని షేక్ జాయెద్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి ప్లే-ఆఫ్ రేసులో ఉండటానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రయత్నం చేస్తుంది. ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిని గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ మరో విజయంతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రెండు జట్లు మధ్ంయ మ్యాచ్ం ఆసక్తికరంగా ఉండబోతుంది.

ఇప్పటివరకు రెండు జట్లు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓడిపోగా.. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ ఓడిపోతే.. ప్లే-ఆఫ్ రేస్‌కు దూరం అయిపోతుంది. డూ or డై పరిస్థితిలో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు క్రిస్ గేల్ తిరిగి వస్తుండగా.. మయాంక్ అగర్వాల్‌తో పాటు క్రిస్ గేల్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. దీపక్ హుడా, ఇషాన్ పోరెల్ ఈరోజు జట్టుతో ప్లేయింగ్ 11లో చేరవచ్చు.

Probable XIs:
Kings XI Punjab: కేఎల్ రాహుల్(C), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ (wk), మన్‌దీప్ సింగ్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్ష్‌దీప్ సింగ్.

కెకెఆర్ గత మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠికి ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వగా.. ఈ యువ బ్యాట్స్ మాన్ జట్టు అంచనాలకు అనుగుణంగా 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు KKR జట్టులో ఎటువంటి మార్పు చోటుచేసుకునే అవకాశం లేదు.

Probable XIs:
Kolkata Knight Riders:
రాహుల్ త్రిపాఠి, శుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగేర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి