IPL 2020, SRHvsDC: బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ.. విలియమ్సన్ ఎంట్రీ

IPL 2020, SRHvsDC: బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ.. విలియమ్సన్ ఎంట్రీ

Updated On : October 27, 2020 / 7:24 PM IST

SRH vs DC మంగళవారం దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో జరిగిన చివరి 4 మ్యాచ్‌ల్లో 2 సార్లు చేజింగ్ జట్లే గెలుపొందాయి. ఈ మైదానంలో ఢిల్లీ 5 మ్యాచ్‌లు ఆడగా.. 4 గెలిచి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ మూడింటిలో మాత్రమే గెలిచింది.

IPLలో ఇరు జట్లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడగా హైదరాబాద్ 10 సార్లు, ఢిల్లీ 6 సార్లు గెలిచింది. గత 5 మ్యాచ్‌ల్లో మాత్రం మూడింటిలో హైదరాబాద్ గెలవగా.. రెండింటిలో ఢిల్లీ విజయం సాధించింది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఫ్లేఆప్‌తో సహా జరిగినవి మూడు మ్యాచ్‌లు అయితే ఢిల్లీ మాత్రమే గెలుపొందింది రెండు.



IPL 2020 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో శనివారం ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తమకు మిగిలిన 3 మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది.

మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించినట్లే. హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ కీలకమైనా జోరు మీదున్న ఢిల్లీని అడ్డుకోవడం అంత సులువు కాదు. 2 మ్యాచ్‌ల్లో జట్టు ఓడినా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి పోటీ తప్పదు.