IPL 2021 CSK vs MI : బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై.. కెప్టెన్‌గా పొలార్డ్

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్

IPL 2021 CSK vs MI : బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై.. కెప్టెన్‌గా పొలార్డ్

Ipl 2021 Csk Vs Mi

Updated On : September 19, 2021 / 7:34 PM IST

IPL 2021 CSK vs MI : ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ లేని కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. దాంతో.. కెప్టెన్‌గా కీరన్ పొలార్డ్ టాస్‌కి వచ్చాడు.

Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

ముంబై, చెన్నై జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచుల్లో ముంబై గెలుపొందింది. మిగిలిన 13 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించింది. ఓవరాల్‌గా ముంబై 5 సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. దుబాయ్ పిచ్ తొలుత పేసర్లకి అనుకూలించి.. ఆ తర్వాత స్పిన్నర్లకి సహకరించే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో ముంబై, చెన్నై జట్లు ఢిల్లీ వేదికగా ఢీకొనగా.. ఆ మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఆఖరి బంతికి 219/6తో ఛేదించింది. కీరన్ పొలార్డ్ (87 నాటౌట్: 34 బంతుల్లో 6×4, 8×6) సంచలన ఇన్నింగ్స్‌తో ముంబై టీమ్‌ని గెలిపించాడు.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

ఈరోజు మ్యాచ్‌లోనూ ముంబై టీమ్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరగగా.. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌ల్ని అక్టోబర్ 15 వరకూ నిర్వహించనున్నారు.

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచే ప్రారంభం కానున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7.30కి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన చెన్నై, ముంబై మధ్య ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరమే.