IPL 2022 : ఐపీల్ ఆరంభానికి ముందే చెన్నైకి భారీ దెబ్బ.. కీలక ఆటగాళ్లు దూరం..!

IPL 2022 : మరో కొద్దిరోజుల్లో ఐపీల్ సీజన్ 2022 ప్రారంభం కానుంది. ఐపీఎల్ డిఫెడింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు భారీ దెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.

IPL 2022 : ఐపీల్ ఆరంభానికి ముందే చెన్నైకి భారీ దెబ్బ.. కీలక ఆటగాళ్లు దూరం..!

Ipl 2022 Blow For Mi & Csk As Suryakumar Yadav And Moeen Ali Could Miss Opening Games

Updated On : March 23, 2022 / 8:09 PM IST

IPL 2022 : మరో కొద్దిరోజుల్లో ఐపీల్ సీజన్ 2022 ప్రారంభం కానుంది. ఐపీఎల్ డిఫెడింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు భారీ దెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లు ఈ సీజన్‌కు దూరం కానున్నారు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయీన్ అలీ.. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. స్టార్ ప్లేయర్‌ సూర్యకుమార్ యాదవ్ కూడా సీజన్ ఓపెనర్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ESPNcricinfo ప్రకారం.. ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ మొయిన్ అలీ IPL 2022 కోసం భారత్‌కు రావాల్సి ఉంది. అయితే వీసా పొందడంలో విఫలం కావడంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఉండిపోయాడు. వీసా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అలీకి సాయం చేసేందుకు బీసీసీఐ కూడా రంగంలోకి దిగిందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.

ఇప్పటికీ వీసా ఇంకా దక్కలేదని, మొదటి మ్యాచ్‌కు అలీ అందుబాటులో ఉండటం చాలా కష్టమని ఆయన అన్నారు. ఒకటి రెండు రోజుల్లో వీసా వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత మెయిన్ అలీ సీఎస్కే జట్టులో చేరే అవకాశం ఉందని తెలిపాడు. మరోవైపు గాయాలతో ఇబ్బందులు పడుతున్న సూర్యకుమార్ యాదవ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నాడు. ఒకవేళ మొయిన్ అలీ భారత్ చేరుకున్నప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరడానికి ముందు అతడు మూడు రోజుల తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. సీజన్ ఓపెనర్‌గా మిగిలిన ఆటగాళ్లతో కలవాలంటే మోయిన్ అలీ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ ఫిట్ నెస్‌పై NCA వైద్య సిబ్బంది క్లారిటీ వస్తే గానీ IPL జట్టులో చేరే పరిస్థితి లేదు. మార్చి 26 నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. సీజన్ ఓపెనర్‌లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడనుంది. ఇరుజట్లు తమ కీలక ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి.

Ipl 2022 Blow For Mi & Csk As Suryakumar Yadav And Moeen Ali Could Miss Opening Games (1)

Ipl 2022 Blow For Mi & Csk As Suryakumar Yadav And Moeen Ali Could Miss Opening Games 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : 1. రుతురాజ్ గైక్వాడ్, 2. మొయిన్ అలీ, 3. ఎంఎస్ ధోని, 4. రవీంద్ర జడేజా, 5. డ్వేన్ బ్రావో, 6. రాబిన్ ఉతప్ప, 7. అంబటి రాయుడు, 8. దీపక్ చాహర్, 9. కెఎమ్ ఆసిఫ్, 10. తుషార్ దేశ్‌పాండే, 11. శివమ్ దూబే, 12. మహేశ్ తీక్షణ, 13. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, 14. సిమర్‌జీత్ సింగ్, 15. డెవాన్ కాన్వే, 16. డ్వైన్ ప్రిటోరియస్, 17. మిచెల్ సాంట్నర్, 18. ఆడమ్ మిల్‌నేహ్రాన్స్, 19 ఆడమ్ మిల్‌పాటి 20. ముఖేష్ చౌదరి, 21. ప్రశాంత్ సోలంకి, 22. సి హరి నిశాంత్, 23. ఎన్ జగదీశన్, 24. క్రిస్ జోర్డాన్, 25. కె భగత్ వర్మ.

ముంబై ఇండియన్స్ జట్టు : 1. రోహిత్ శర్మ, 2. సూర్యకుమార్ యాదవ్, 3. కీరన్ పొలార్డ్, 4. జస్ప్రీత్ బుమ్రా, 5. ఇషాన్ కిషన్, 6. డెవాల్డ్ బ్రెవిస్, 7. బాసిల్ థంపి, 8. మురుగన్ అశ్విన్, 9. జయదేవ్ ఉనద్కత్, 10 . మయాంక్ మార్కండే, 11. ఎన్ తిలక్ వర్మ, 12. సంజయ్ యాదవ్, 13. జోఫ్రా ఆర్చర్, 14. డేనియల్ సామ్స్, 15. టైమల్ మిల్స్, 16. టిమ్ డేవిడ్, 17. రిలే మెరెడిత్, 18. మహ్మద్ అర్షద్ ఖాన్, 19. అన్మోల్‌ప్రీత్ సింగ్ , 20. రమణదీప్ సింగ్, 21. రాహుల్ బుద్ధి, 22. హృతిక్ షోకీన్, 23. అర్జున్ టెండూల్కర్, 24. ఆర్యన్ జుయల్, 25. ఫాబియన్ అలెన్.

Read Also : IPL Season 15 : బుక్ మై షోతో ఒప్పందం.. IPL టికెట్లు