IPL 2023: శిఖర్ ధావన్ సహా హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ కింగ్స్ టీమ్

పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కు సంబంధించిన ఓ వీడియోను ఆ జట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మీరూ చూసేయండి...

IPL 2023: శిఖర్ ధావన్ సహా హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ కింగ్స్ టీమ్

Punjab Kings Team, Pic Credit: PunjabKingsIPL Twitter

Updated On : April 7, 2023 / 7:16 PM IST

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (srh)-పంజాబ్ కింగ్స్ (pbks) మధ్య ఆదివారం మ్యాచు జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు నేడు హైదరాబాద్ చేరుకుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ వచ్చామంటూ పంజాబ్ కింగ్స్ క్రికెట్ టీమ్ ట్విట్టర్ లో పేర్కొంది.

పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇటీవల ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అవమానకర రీతిలో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలం అయింది.

రాజస్థాన్ 203 పరుగులు చేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ 27, అబ్దుల్ 28 పరుగులు చేశారు. మిగతా ఏ బ్యాటరూ రాణించలేదు. దీంతో 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం నాటికి పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చిట్టచివరి స్థానంలో ఉంది.

 

IPL 2023, LSG vs SRH: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్.. Live Updates