IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో ఆ రికార్డును బద్దలు కొట్టేది అతనొక్కడే.. ఆసీస్ మాజీ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం ప్రక్రియ దుబాయ్ వేదికగా జరగనుంది. 333 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో ఆ రికార్డును బద్దలు కొట్టేది అతనొక్కడే.. ఆసీస్ మాజీ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

Steve Smith and Mitchell Starc

Updated On : December 19, 2023 / 1:02 PM IST

Former SunRisers Coach Tom Moody : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం ప్రక్రియ దుబాయ్ వేదికగా జరగనుంది. 333 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 77 స్లాట్స్ ఉన్నాయి. ఇందులో 30 స్లాట్లు విదేశీ ప్లేయర్లవి. 23 మంది ప్లేయర్లు రూ. 2కోట్ల బేస్ ధరలో, 13 మంది ప్లేయర్లు 1.5కోట్ల బేస్ ధరలో అందుబాటులో ఉన్నారు. ప్రతి జట్టులో 25 మంది వరకు ఆటగాళ్లు ఉండొచ్చు. ఇదిలాఉంటే.. ఆటగాళ్లను సొంత చేసుకునేందుకు పది ఫ్రాంచైజీలు కలిపి రూ. 262.95 కోట్లు వెచ్చించనున్నాయి.

Also Read : IPL 2024 : మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజ‌న్ ఆరంభం..?

ఈ వేలంలో భారీ ధరను దక్కించుకునే అవకాశం ఉన్నవారిలో విదేశీ ప్లేయర్లే అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంపై ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో ఆసీస్ మాజీ ప్లేయర్, సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోతాడని అనుకోవటం లేదని ఆయన అంచనా వేశారు. ఈ వేలంలో వన్డే వరల్డ్ కప్ 2023లో రాణించిన ప్లేయర్స్ కు ప్రాంచైజీలు పెద్దపీట వేస్తాయని, వేలంలో వారిని అత్యధిక ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని టామ్ మూడీ అన్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కర్రాన్ పేరిటఉన్న రూ. 18.50 కోట్ల ఆల్ టైమ్ రికార్డు వేలం ధరను ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ బద్దలు కొట్టడం ఖాయమని టామ్ మూడీ అంచనా వేశారు.

Also Read : Mallika Sagar : ఐపీఎల్ మినీ వేలం.. ఆక్ష‌నీర్ మ‌ల్లికా సాగ‌ర్ ఎవ‌రో తెలుసా..?

ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత న‌గ‌దు ఉందో తెలుసా..?

గుజ‌రాత్ టైటాన్స్‌..
మిగిలిన ఫ్రాంచైజీల‌తో పోలిస్తే గుజ‌రాత్ టైటాన్స్ వ‌ద్ద అత్య‌ధికంగా న‌గ‌దు ఉంది. ఆ జ‌ట్టు వ‌ద్ద 38.15 కోట్ల న‌గ‌దు ఉంది. వేలంలో 7 గురు ప్లేయ‌ర్లును తీసుకోవ‌చ్చు. ఇందులో 5 గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. ఇద్ద‌రు విదేశీ ప్లేయ‌ర్లు.

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌..
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ వ‌ద్ద రూ.34 కోట్లు ఉన్నాయి. వేలంలో 6 గురుని తీసుకోవ‌చ్చు. ఇందులో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. మ‌రో ముగ్గురు విదేశీ ప్లేయ‌ర్లు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్ ..
కోల్‌కతా నైట్‌ రైడర్స్ రూ.32.7 కోట్లు ఉన్నాయి. వేలంలో 12 మందిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 8 మంది భార‌త ఆట‌గాళ్లు కాగా.. 4 గురు విదేశీ ప్లేయ‌ర్లు.

చెన్నై సూపర్‌ కింగ్స్ ..
చెన్నై సూపర్‌ కింగ్స్ వ‌ద్ద రూ.31.4 కోట్లు ఉన్నాయి. వేలంలో 6 గురుని తీసుకోవ‌చ్చు. ఇందులో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. మ‌రో ముగ్గురు విదేశీ ప్లేయ‌ర్లు.

పంజాబ్‌ కింగ్స్‌..
పంజాబ్‌ కింగ్స్ వ‌ద్ద రూ.29.1 కోట్లు ఉన్నాయి. వేలంలో 8 మందిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 6 గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. 2 గురు విదేశీ ప్లేయ‌ర్లు.

ఢిల్లీ క్యాపిటల్స్‌..
ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ద్ద రూ. 28.95 కోట్లు న‌గ‌దు ఉంది. వేలంలో 9 మందిని తీసుకోవ‌చ్చు. ఇందులో 5 మంది భార‌త ఆట‌గాళ్లు కాగా.. 4 గురు విదేశీ ప్లేయ‌ర్లు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వ‌ద్ద రూ.23.25 కోట్ల న‌గదు అందుబాటులో ఉంది. వేలంలో 7 గురిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 3 గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. 4 గురు విదేశీ ప్లేయ‌ర్లు.

ముంబై ఇండియన్స్‌..
ముంబై ఇండియన్స్ వ‌ద్ద రూ.17.75 కోట్ల న‌గ‌దు అందుబాటులో ఉంది. వేలంలో 7గురిని తీసుకోవ‌చ్చు. ఇందులో 4గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. 3 గురు విదేశీ ప్లేయ‌ర్లు.

రాజస్తాన్‌ రాయల్స్‌..
రాజస్తాన్‌ రాయల్స్ వ‌ద్ద రూ.14.5 కోట్లు ఉన్నాయి. వేలంలో ఎనిమిది మందిని కొనుగోలు చేయొచ్చు. ఇందులో 5గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. 3 గురు విదేశీ ప్లేయ‌ర్లు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌..
లక్నో సూపర్‌ జెయింట్స్ వ‌ద్ద రూ.13.15 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వేలంలో ఆరుగురిని తీసుకోవ‌చ్చు. ఇందులో 4గురు భార‌త ఆట‌గాళ్లు కాగా.. ఇద్ద‌రు విదేశీ ప్లేయ‌ర్లు.