IPL 2024 : మ్యాచ్ తరువాత సన్‌రైజర్స్ జట్టు ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది.

sunrisers hyderabad
SunRisers Hyderabad : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. ఆది నుంచి సన్‌రైజర్స్ బ్యాటర్లు ముంబై జట్టు బౌలర్లను ఊచకోత కోశారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. హెడ్ 62, అభిషేక్ 63, క్లాసెన్ నాటౌట్ 80 పరుగులతో స్టేడియం నలువైపుల ఫోర్ల వర్షం కురిపించారు. దీంతో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ (277) నమోదు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 31 పరుగుల తేడాతో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది.
Also Read : IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్
మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. మైదానంలో సందడి చేసిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు.. అనంతరం వారు బసచేసే హోటల్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్ రూంలోకి వెళ్లిన ప్లేయర్స్ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
An innings so good, it had to be rewarded… With cake on @IamAbhiSharma4's face ??
The post-match vibes were ?????????? ??#PlayWithFire #SRHvMI pic.twitter.com/C3ThofIivu
— SunRisers Hyderabad (@SunRisers) March 28, 2024