IPL 2025: వర్షం కారణంగా కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు

మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

IPL 2025: వర్షం కారణంగా కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు

Courtesy BCCI @IPL

Updated On : April 26, 2025 / 11:24 PM IST

IPL 205: కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా.. తొలి ఓవర్ లో 7 పరుగులు చేసింది. అంతే.. వర్షం మొదలైంది. దాంతో ఆట నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ నిర్వహించేందుకు సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

కోల్ కతా జట్టు ఒక ఓవర్ ఆడిందో లేదో వర్షం మొదలైంది. 10 గంటల 20 నిమిషాలకు వాన ఆగింది. దీంతో సిబ్బంది పిచ్ ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతలోనే మళ్లీ వర్షం మొదలైంది. దాంతో మ్యాచ్ నిర్వహణకు అవకాశాలు లేకుండా పోయాయి.

Also Read: పాక్‌తో ఇక ఐసీసీ టోర్నీల్లోనూ భారత్‌ ఆడకూడదు అంతే..: గంగూలీ

పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆర్య 35 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. సింగ్ 49 బంతుల్లోనే 83 పరగులు బాదాడు. వీరిద్దరూ సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించారు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. పాయింట్ల టేబుల్ విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు 4వ స్థానంలో, కోల్ కతా జట్టు 7వ స్థానంలో ఉంది.