IPL 2025: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌.. 2,381 బంతుల్లోనే ఘనత.. బుమ్రా, చాహ‌ల్‌ను వెన‌క్కునెట్టేసి..

ఎస్ఆర్‌హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. లసిత్ మలింగ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ లను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

IPL 2025: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌.. 2,381 బంతుల్లోనే ఘనత.. బుమ్రా, చాహ‌ల్‌ను వెన‌క్కునెట్టేసి..

BCCI Credit

Updated On : May 20, 2025 / 7:28 AM IST

IPL 2025: ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దీంతో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. లసిత్ మలింగ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ లను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Also Read: IPL 2025: గ్రౌండ్‌లో కొట్టుకున్నంత ప‌నిచేశారు..! అభిషేక్ శ‌ర్మ‌, దిగ్వేశ్ మ‌ధ్య‌ తీవ్ర వాగ్వాదం.. చివరిలో బిగ్ ట్విస్ట్.. వీడియో వైర‌ల్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ క్రమంలో లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ రికార్డును బద్దలుకొట్టాడు. ఐపీఎల్ లో లసిత్ మలింగ 105 మ్యాచ్ లలో 150 వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్ 117 మ్యాచ్ లలో ఈ ఘనత సాధించాడు. అయితే, బంతుల విషయానికి వస్తే హర్షల్ పటేల్ మలింగ రికార్డును అధిగమించాడు.

 

హర్షల్ పటేల్ అతి తక్కువ బంతుల్లో 150 ఐపీఎల్ వికెట్లు పూర్తి చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ మార్క్రామ్ వికెట్ తీయడం ద్వారా సరికొత్త రికార్డును నమోదు చేశాడు. పటేల్ 2,381 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టగా.. లసిత్ మలింగ 2,444 బంతుల్లో 150 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో యుజేంద్ర చాహల్, జస్ర్పీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. చాహల్ (118 మ్యాచ్ లు) 2,543 బంతుల్లో 150 వికెట్లు తీయగా.. జస్ర్పీత్ బుమ్రా 2,832 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టాడు.

Also Read: IPL 2025 : హైదరాబాద్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ నుంచి లక్నో నిష్క్రమణ

IPLలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన ఆటగాడు (బౌల్ చేసిన బంతుల పరంగా)
హర్షల్ పటేల్ – 2,381 బంతులు
లసిత్ మలింగ – 2,444 బంతులు
యుజ్వేంద్ర చాహల్ – 2,543 బంతులు
డ్వేన్ బ్రావో – 2,656 బంతులు
జస్ప్రీత్ బుమ్రా – 2,832 బంతులు

34ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్ -2025 సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 11 ఇన్నింగ్స్‌లలో 24.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతను తన కెరీర్‌లో రెండుసార్లు పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు, మొదటిసారి 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున 32 వికెట్లు పడగొట్టాడు. రెండవసారి 2024లో పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున 24 వికెట్లు పడగొట్టాడు.