IPL 2025: బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ గెలుపు

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది.

IPL 2025: బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ గెలుపు

Courtesy BCCI

Updated On : April 19, 2025 / 12:23 AM IST

IPL 2025: హోమ్ గ్రౌండ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. ఆర్సీబీపై పంజాబ్ గెలుపొందింది. 5 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించారు. వాన రావడంతో పిచ్ బౌలింగ్‌కు అనుకూలించింది.

టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. 6.1 ఓవర్లలో 33 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో టిమ్ డేవిడ్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. డేవిడ్ 26 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కెప్టెన్ రజిత్ పటిదార్ 23 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, జాన్ సెన్, చాహల్, హర్ ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: ఎవరీ చిచ్చరపిడుగు? ఉన్నట్టుండి ఇతడిని ధోనీ టీమ్‌ ఎందుకు తీసుకుంది? ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తుంది?

అటు పంజాబ్ బ్యాటర్లలో నెహల్ వధేరా 33 పరుగులతో రాణించాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ప్రియాంశ్ ఆర్య 16 పరుగులు, ప్రబ్ సిమ్రాన్ సింగ్ 13 పరుగులు, ఇంగ్లిస్ 14 పరుగులు చేశారు.

ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన పంజాబ్ ఐదింటిలో గెలిచింది. ఇది వరుసగా రెండో విజయం. బెంగళూరు పాయింట్స్ టేబుల్ లో 4వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ 4 మ్యాచుల్లో నెగ్గింది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన ఆర్సీబీ.. పంజాబ్ చేతిలో పరాజయం పాలైంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here