IPL 2025: అయ్యో రిష‌బ్ పంత్‌.. ఇదెక్కడి ఆట సామీ..! ఒంటిచేత్తో మ‌లింగ‌ అద్భుత క్యాచ్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

IPL 2025: అయ్యో రిష‌బ్ పంత్‌.. ఇదెక్కడి ఆట సామీ..! ఒంటిచేత్తో మ‌లింగ‌ అద్భుత క్యాచ్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

@BCCI

Updated On : May 20, 2025 / 8:17 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ప్లాప్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పంత్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. హైదరాబాద్ బౌలర్ ఎషాన్ మలింగ స్లో యార్కర్ తో పంత్ ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో మలింగ ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. అయితే, పంత్ ఔట్ అయిన తరువాత కెమెరాలన్నీ లక్నో జట్టు యాజమాని సంజీవ్ గోయెంకా వైపు మళ్లాయి. అతను పంత్ ఔట్ తరువాత నిరాశగా స్టాండ్ నుంచి వెళ్లిపోవడం కెమెరాల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: IPL 2025: గ్రౌండ్‌లో కొట్టుకున్నంత ప‌నిచేశారు..! అభిషేక్ శ‌ర్మ‌, దిగ్వేశ్ మ‌ధ్య‌ తీవ్ర వాగ్వాదం.. చివరిలో బిగ్ ట్విస్ట్.. వీడియో వైర‌ల్

గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ ను ఎల్ఎస్‌జీ యాజమాన్యం రికార్డు ధరతో (రూ.27కోట్లు) దక్కించుకుంది. అయితే, పంత్ మాత్రం బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైతో మ్యాచ్ లో చేసిన 63 పరుగులు మినహాయిస్తే మిగతా మ్యాచ్ లలో పెద్దగా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరోసారి సున్నాకే ఔటయ్యాడు. దీంతో పంత్ బ్యాటింగ్ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక లక్నో జట్టు యాజమాని సంజీవ్ గోయెంకా గురించి చెప్పాల్సిన పనిలేదు. పలుసార్లు పంత్ పై గోయెంకా సీరియస్ అయినట్లు కూడా కనిపించింది.

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌.. 2,381 బంతుల్లోనే ఘనత.. బుమ్రా, చాహ‌ల్‌ను వెన‌క్కునెట్టేసి..

సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఎషాన్ మలింగ 12 ఓవర్లో ఐదు బంతిని స్లో యార్కర్ వేశాడు. దీంతో రిషబ్ పంత్ స్ట్రైట్ గా భారీ షాట్ కు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేచి బౌలర్ పక్కనుంచి వెళ్తుండగా.. మలింగ డ్రైవ్ చేసి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మలింగ పట్టిన అద్భుత క్యాచ్ తో పంత్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. పంత్ ఔట్ అయిన తరువాత లక్నో జట్టు యాజమాని సంజీవ్ గోయెంకా స్టాండ్ నుంచి ఆగ్రహంతో వెళ్లిపోవడం కనిపించింది.