IPL 2025 : అభిషేక్ శర్మ విధ్వంసం.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ అవ్వగానే ఏం రాశాడో చూడండి..
ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Courtesy BCCI @eternal_shivam
IPL 2025: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. బ్యాట్ తో విధ్వంసం చేశాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు అభిషేక్.
ఆది నుంచి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు. బౌలర్ ఎవరైనా, ఎలాంటి బాల్ వేసినా.. రిజల్ట్ మాత్రం బౌండరీనే. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయంటే ఏ రేంజ్ లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శర్మ చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ లో తొలి సెంచరీ చేయగానే అభిషేక్ శర్మ ఓ పేపర్ ను చూపించాడు. గ్రౌండ్ మొత్తం ఆ పేపర్ ను చూపించాడు. ఆ పేపర్ లో థిస్ వన్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసి ఉంది.
Also Read : మీరు ఇంత సింపుల్‌గా ఉంటారా మేడం.. హైదరాబాద్‌లో ప్రీతి జింటా..
ధాటిగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ ఔటయ్యాడు. 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ కు పర్ ఫెక్ట్ స్టార్టింగ్ ఇచ్చాడు శర్మ. చేయాల్సిన విధ్వంసం చేసి వెళ్లిపోయాడు.
This one is for #OrangeArmy 🧡 #SRHvPBKS https://t.co/KVwHQHU9WZ pic.twitter.com/IDAgTqfum9
— S H i V A M 𝕩 🔥 (@eternal_shivam) April 12, 2025