IPL 2026 : సీఎస్‌కే జట్టులోకి కొత్త కెప్టెన్.. ధోనీ సీజన్ మధ్యలోనే ఔట్.. పెద్ద బాంబు పేల్చిన మాజీ క్రికెటర్

IPL 2026 : ఐపీఎల్ -2026 సీజన్‌కు సమయం దగ్గర పడుతుంది. దీంతో జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లపై దృష్టి కేంద్రీకరించాయి.

IPL 2026 : సీఎస్‌కే జట్టులోకి కొత్త కెప్టెన్.. ధోనీ సీజన్ మధ్యలోనే ఔట్.. పెద్ద బాంబు పేల్చిన మాజీ క్రికెటర్

IPL 2026

Updated On : November 10, 2025 / 2:16 PM IST

IPL 2026 : ఐపీఎల్ -2026 సీజన్‌కు సమయం దగ్గర పడుతుంది. దీంతో జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్స్ లో ఒకదానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరగనున్న ఈ ట్రేడ్ డీల్‌లో.. రాజస్థాన్ రాయల్స్ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నైకి రానుండగా.. సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకునేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధమవ్వగా.. అందుకు బదులుగా సీఎస్కే జట్టు నుంచి రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ ను రాజస్థాన్ కు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, రవీంద్ర జడేజా విషయంలో అంగీకారం తెలిపిన రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం.. సామ్ కర్రన్ విషయంలో అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.

అతని స్థానంలో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరనను ఇవ్వాలని సీఎస్కే జట్టును కోరుతుందట. అయితే, మతీశ పతిరనను పంపించేందుకు సీఎస్కే ససేమీరా అంటోందని సమాచారం. దీంతో ప్రస్తుతం ఇరు జట్ల మధ్య చర్చలకు బ్రేక్ పడినా.. త్వరలో వీరి మధ్య ట్రేడ్ డీల్ ప్రక్రియ సజావుగా ముస్తుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ధోనీ పేరును ప్రస్తావిస్తూ కీలక కామెంట్స్ చేశారు.

మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. రాజస్థాన్, సీఎస్కే జట్ల మధ్య డీల్ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ కీలక భూమిక పోషిస్తున్నారని మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. వ్యూహాలకు దిట్టగా పేరుగాంచిన ధోనీకి బహుశా వచ్చే ఐపీఎల్ చివరిది అవుతుంది. దీంతో జట్టుకు దీర్ఘకాలిక నాయకత్వాన్ని అందించే క్రమంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లుగా భావించొచ్చు. ఈ క్రమంలో మ్యాచ్ విన్నర్‌గా పేరున్న రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సిద్ధమయ్యారు.

అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే.. సీఎస్‌కేలో చేరినప్పటి నుండి, ధోనీ ఎప్పుడూ ఫ్రాంచైజీని వదిలి వెళ్ళలేదు. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై జట్టులోకి శాంసన్ వస్తే.. బహుశా ధోనీకి అదే ఐపీఎల్ చివరి సీజన్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే సీజన్ మధ్యలోనే సీఎస్కే జట్టు నుంచి ధోనీ పక్కకు వెళ్లిపోయినా ఆశర్య పడాల్సిన పనిలేదు. సంజు జట్టు సభ్యులతో, యాజమాన్యంతో కలిసిపోతే ధోనీ అతనికి పగ్గాలు అప్పగించవచ్చు అని కైఫ్ వివరించారు.