Yash Dayal : యశ్ దయాళ్‌కు నోప్లేస్.. అతడి స్థానంలో ఎవరినీ తీసుకోం.. ఆర్సీబీ డైరెక్టర్ మో బోబాట్
యశ్ దయాళ్ (Yash Dayal) విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2026 RCB confirm no replacement for Yash Dayal
Yash Dayal : యశ్ దయాళ్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. అతడు జట్టులో చేరడం లేదని చెప్పింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సీజన్లో పాల్గొనబోడని తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో యశ్ దయాళ్ విషయంలో ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్లిష్ట సమయంలో దయాళ్‌కు ఫ్రాంచైజీ మద్దతు ఉంటుందని ఆర్సిబి క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ తెలిపారు. టోర్నమెంట్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మో బోబాటు.. యశ్ దయాళ్ జట్టుతో చేరడం లేదని చెప్పాడు. అతడు ఓ వ్యక్తిగత సమస్యతో బాధపడుతున్నాడని, ఈ విషయం అందరికి తెలుసు అని అన్నాడు. మా మద్దతు అతడికి ఉంటుంది. ఈ విషయం అతడిని రిటైన్ చేసుకోవడంలోనే అర్థమై ఉంటుందన్నాడు.
Rajasthan Royals : ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద డీల్.. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
అతడు కాంట్రాక్ట్‌లోనే ఉన్నాడన్నాడు. అతడినితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో అతడు జట్టుతో చేరడం.. అతడికి గానీ, ఫ్రాంఛైజీకి కాని మంచిది కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపాడు. ఇక అతడి స్థానంలో ఎవరిని తీసుకోమని చెప్పాడు.
గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలవడంలో యశ్ దయాళ్ కీలక పాత్ర పోషించాడు. 9.59 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు.
