IPL 2020: 73మంది ప్లేయర్లకు రూ.207.65కోట్లు

IPL 2020 వేలానికి సర్వం సిద్ధమైంది. కోల్‌కతా వేదికగా జరగనున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు ఖాళీ స్లాట్లను భర్తీ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికంగా రూ.42.70కోట్లతో 9స్లాట్లు ఖాళీ ఉంచుకుని బరిలోకి దిగుతుంది. అత్యల్పంగా 13.05కోట్లతో 7స్లాట్లతో ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోంది.
గతేడాది జరిగిన ఐపీఎల్ 2019వేలంలో జయదేవ్ ఉనదక్త్, వరుణ్ చక్రవర్తి రాజస్థాన్ రాయల్స్‌కు, కింగ్స్ఎలెవన్ పంజాబ్‌కు అత్యధిక ధరకు ఒక్కొక్కరు రూ.8.5కోట్లు చొప్పున అమ్ముడుపోయారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ రూ.7.2కోట్లతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
అఫ్ఘనిస్తాన్ యువ కెరటం:
అండర్-19జట్టుకు ఆడుతున్న నూర్ అహ్మద్ కనీస ధర రూ.30లక్షలతో వేలంలో అడుగుపెడుతున్నాడు. ఔరా అనిపించే ఆటతీరుతో ఐదు మ్యాచ్‌లలో 9వికెట్లు పడగొట్టి ఐపీఎల్ వేలం షార్ట్ లిస్టులో తానొకడిగా నిలిచాడు.
ఈ ఏడాది వేలంలో క్రిస్ లిన్, పాట్ కమిన్స్, షిమ్రోన్ హెట్‌మేయర్, జోష్ హేజిల్‌వుడ్‌లు అధిక ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది ఫ్రాంచైజీలు మొత్తంగా 73మంది ప్లేయర్లకు గాను రూ.207.65కోట్లతో సిద్ధమయ్యాయి. ఈ ఏడాది టైటిల్ గెలుచుకునేందుకు జట్లను తయారుచేసుకునే పనిలో పడిన జట్లు కొనుగోలు ప్రక్రియలో ఏ మేర ఉత్సాహం కనబరుస్తాయో చూడాలి మరి.
జట్టు | మిగిలిన మొత్తం | ఖాళీ స్థానాలు | విదేశీ ఆటగాళ్లు |
---|---|---|---|
Kings XI Punjab | 42.70 రూ.కోట్లలో | 9 | 4 |
Kolkata Knight Riders | 35.65రూ.కోట్లలో | 11 | 4 |
Rajasthan Royals | 28.90రూ.కోట్లలో | 11 | 4 |
Royal Challengers Bangalore | 27.90రూ.కోట్లలో | 12 | 6 |
Delhi Capitals | 27.85రూ.కోట్లలో | 11 | 5 |
Sunrisers Hyderabad | 17రూ.కోట్లలో | 7 | 2 |
Chennai Super Kings | 14.60రూ.కోట్లలో | 5 | 2 |
Mumbai Indians | 13.05రూ.కోట్లలో | 7 | 2 |
వేలం జరిగేదెప్పుడు:
గురువారం, డిసెంబరు 19 మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు
వేలం జరిగే చోటు:
బెంగళూరులో జరిగే ఈవెంట్‌ను ఈ ఏడాది కొత్తగా కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు.
వేలం ప్రసారమయ్యే ఛానెల్:
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా
వేలానికి ఎంతమంది ఉన్నారంటే..:
971మంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 332మందిని ఎంపిక చేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. వారు 73ఖాళీ స్లాట్‌లు భర్తీ చేయనున్నారు.
ఐపీఎల్ వేలం నిర్వహించే వ్యక్తి:
ఏటా ఐపీఎల్ వేలం నిర్వహించే హ్యూ ఎడ్మీడెస్ మారాడు. అతని స్థానంలో రిచర్డ్ మ్యాడ్లీ వేలాన్ని నిర్వహించనున్నారు.