ఐపీఎల్ ముంగిట హాఫ్ సెంచరీతో మెప్పించిన రైనా

టీమిండియా వెటరన్ క్రికెటర్.. చెన్నై సూపర్ కింగ్స్ ఆశాకిరణం సురేశ్ రైనా.. ఐపీఎల్ ముంగిట రెచ్చిపోయాడు. ప్రాక్టీస్ గేమ్‌లో 29 బంతుల్లోనే 56పరుగులు చేసి సత్తా చాటాడు. మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ సీజన్‌కు అన్ని జట్లు తమ సొంతగడ్డపై ప్రాక్టీసును తీవ్రతరం చేశాయి.
Read Also : IPL 2019: క్రిస్ గేల్ యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్
గతేడాదిలాగే చెన్నై సూపర్ కింగ్స్ అన్ని జట్ల కంటే ముందుగానే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. చెన్నై జట్టు దూకుడుగా ఆడుతోంది. ఈ ప్రాక్టీస్ గేమ్‌లో మురళీ విజయ్ (29 బంతుల్లో 32), అంబటి రాయుడు (23 బంతుల్లో 40) చేశారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై 6వికెట్లు పడగొట్టి 199పరుగులు చేసింది. కాగా, ఈ ప్రాక్టీసు గేమ్‌లో ధోనీ కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడు. ఆఖరి సీజన్లో రైనా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏలాడు. 15 ఇన్నింగ్స్ ఆడి 445 పరుగులు చేశాడు. 11 ఐపీఎల్ ఎడిషన్లు ఆడిన రైనా ఇలా ఒక సీజన్లో 400 పరుగులకు మించి స్కోరు చేయడం 9వ సారి.