IPL2022 CSK Vs GT : వాటే మ్యాచ్.. డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. చెన్నైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్ ను..

IPL2022 CSK Vs GT : వాటే మ్యాచ్.. డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. చెన్నైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

Ipl2022 Csk Vs Gt

Updated On : April 17, 2022 / 11:37 PM IST

IPL2022 CSK Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్ ను 7 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో మూడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది గుజరాత్.

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. రషీద్ ఖాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో మూడు సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టాడు. మహీశ తీక్షణ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేడా, ముకేశ్ చౌదరి తలో వికెట్ తీశారు.(IPL2022 CSK Vs GT)

Rishabh Pant: “ఫస్ట్ గేమ్ కే అతణ్ని నిందించడం కరెక్ట్ కాదు”

బ్యాటింగ్‌ ఆరంభంలో తడబడినా.. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (40), డేవిడ్‌ మిల్లర్‌ (94*) ఇద్దరే దంచికొట్టడంతో ఈ గెలుపు సునాయాసమైంది. మిగిలిన బ్యాటర్లు సాహా (11), గిల్‌ (0), విజయ్‌ శంకర్‌ (0), అభినవ్‌ మనోహర్‌ (12), తెవాతియా (6), జోసెఫ్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి గుజరాత్‌ను గెలిపించడంలో కీ రోల్ ప్లే చేశాడు. మిల్లర్‌తో పాటు కెప్టెన్‌ రషీద్ ఖాన్‌ (40) వీరోచిత బ్యాటింగ్‌ చేశాడు. ఈ ఇద్దరూ చెన్నై నుంచి గెలుపుని లాగేసుకున్నారు. కాగా, ఈ విజయంతో గుజరాత్‌ (10) పాయింట్ల పట్టికలో టాప్ లోనే కంటిన్యూ అవుతోంది. మరోవైపు చెన్నై ఈ సీజన్ లో ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

కొత్త కుర్రాళ్లతో వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది గుజారాత్ టైటాన్స్. తాజాగా చెన్నైని చిత్తు చేసి నెంబర్ 1 ప్లేస్ నిలబెట్టుకుంది. కాగా, తన ఐదో మ్యాచ్‌లో తొలి గెలుపు రుచి చూసిన చెన్నై జట్టు.. తొలి విజయం ఊపును కొనసాగించలేకపోయింది. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

Rohit Sharma: బాధ్యత అంతా నాదే.. ఆరో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్పందన

జట్ల వివరాలు:

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ : రాబిన్ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ,
డ్వేన్ బ్రావో, క్రిస్‌ జొర్డాన్, మహీశ తీక్షణ, ముకేశ్‌ చౌదరి

గుజరాత్ టైటాన్స్ టీమ్ ‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్, విజయ్‌ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్‌ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్‌ (కెప్టెన్‌),
అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్, మహమ్మద్‌ షమీ