IPL2022 LSG Vs RCB : దంచికొట్టిన డుప్లెసిస్.. లక్నో టార్గెట్ 182

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో ముందు 182 పరుగుల..

IPL2022 LSG Vs RCB : దంచికొట్టిన డుప్లెసిస్.. లక్నో టార్గెట్ 182

Ipl2022 Lsg Vs Rcb

Updated On : April 19, 2022 / 9:29 PM IST

IPL2022 LSG Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో ముందు 182 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్, ఓపెనర్ డుప్లెసిస్ దంచికొట్టాడు. 64 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఫలితంగా బెంగళూరు జట్టు 181 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో జేసన్ హోల్డర్, చమీర తలో రెండు వికెట్లు తీశారు. కృనాల్ పాండ్య ఒక వికెట్ తీశాడు.