IPL2022 RR Vs PBKS : రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు.. పంజాబ్‌పై సూపర్ విక్టరీ
రాజస్తాన్ అదరగొట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత విజయం నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్..

Ipl2022 Rr Vs Pbks
IPL2022 RR Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ అదరగొట్టింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. రాజస్తాన్ జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాప్ ఆర్డర్ విశేషంగా రాణించింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 41 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

IPL2022 RR Vs PBKS Rajasthan Royals Won On Punjab Kings By 6 Wickets
మరో ఓపెనర్ జోస్ బట్లర్ 30 పరుగులు(16 బంతులు) చేశాడు. వీరిద్దరూ మంచి శుభారంభం ఇచ్చారు. చివర్లో దేవదత్ పడిక్కల్ (31), షిమ్రోన్ హెట్ మైర్ (16 బంతుల్లో 31*) దూకుడుగా ఆడారు. కెప్టెన్ సంజూ శాంసన్ (23) ఫర్వాలేదనిపించాడు. రాజస్తాన్ బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో లక్ష్యాన్ని అలవోకగా పూర్తి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, రిషి ధావన్ తలో వికెట్ తీశారు.
David Warner: క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్
Yashasvi Jaiswal is our Top Performer from the second innings for his brilliant knock of 68 off 41 deliveries.
A look at his batting summary here ?? #TATAIPL pic.twitter.com/TYWguLi2Ge
— IndianPremierLeague (@IPL) May 7, 2022
వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్తాన్ విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో రాజస్తాన్ (14) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. అంతేకాదు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టోర్నీలో ఇప్పటిదాకా 11 మ్యాచులు ఆడిన రాజస్తాన్ 7 విజయాలు సాధించింది.
Delhi Capitals: గంటకు 157కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. IPL 2022 ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ బెయిర్ స్టో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. బెయిర్ స్టో 40 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. పంజాబ్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (12) విఫలమైనా, భానుక రాజపక్స (27)తో కలిసి బెయిర్ స్టో విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మిడిలార్డర్ లో బరిలో దిగిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (15) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చివర్లో జితేష్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్ మెరుపు బ్యాటింగ్ తో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.
జితేష్ శర్మ 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 38 పరుగులు చేయగా, లివింగ్ స్టోన్ 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లతో 22 పరుగులు సాధించాడు. ఆఖరి 10 ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 101 పరుగులు సాధించడం విశేషం. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
రాజస్తాన్ రాయల్స్ జట్టు : జోస్ బట్లర్, జైస్వాల్, సంజూ శాంసన్, పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్డ్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.
పంజాబ్ కింగ్స్ జట్టు : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, రాజపక్స, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ.
That’s that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ
— IndianPremierLeague (@IPL) May 7, 2022