కోహ్లీసేన జైత్రయాత్ర: టెస్టు ఫార్మాట్ కూడా మనదే

భారత జట్టు సునాయాసంగా టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజులోనూ కరేబియన్లపై జైత్ర యాత్ర కొనసాగించింది. కింగ్ స్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
468పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. రెండో ఇన్నింగ్స్ లో 210పరుగులతో సరిపెట్టుకుంది. 45/2ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభంలో కాస్త దూకుడు చూపించినా నిలబెట్టుకోలేకపోయింది. భారత బౌలర్ల విజృంభణకు తలవొంచింది.
రవీంద్ర జడేజా(3/58), మొహ్మద్ షమీ(3/65), ఇషాంత్ శర్మ(2/37)తో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో 416పరుగులు చేసిన భారత్ ప్రత్యర్థిని 117పరుగులకే కట్టడి చేసింది. ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేన 54.4ఓవర్లలో 4వికెట్లు కోల్పోయిన భారత్ 168పరుగులకే డిక్లేర్ చేసింది.
టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 28విజయాలు సాధించాడు. కోహ్లీ కెప్టెన్సీలో 48టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10ఓడి, 10డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌తో 60మ్యాచ్‌లలో 27గెలిచి టాప్‌లో ఉన్న ధోనీ రికార్డును కోహ్లీ అధిగమించాడు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్:
విండీస్‌తో మ్యాచ్‌లో హనుమ విహారీ టెస్టు సెంచరీ సాధించాడు. ‘చివరిసారి అవకాశం దక్కినప్పుడు సెంచరీ మిస్ అయ్యాను. ఈ సారి బాగా ఆడాలనుకున్నాడు. 200పరుగులకు 5వికెట్లు నష్టపోయి ఉన్నాం. ఆ స్థితిలో ఫాస్ట్ బౌలర్లను సహనంతో ఎదుర్కొంటూ పంత్‌తో పార్టనర్ షిప్ కొనసాగించాలనుకున్నా. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో నాకొక కాలిక్యూలేషన్ ఉంది’ అని మ్యాచ్ అనంతరం హనుమ విహారీ తెలిపారు.