బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్

ముంబై ఇండియన్స్ ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌లు కొనియాడారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో బుమ్రా 4ఓవర్లు వేసి 2/14స్కోరుతో అదరగొట్టాడు.
మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన యువరాజ్, సచిన్‌లు మ్యాచ్ అనంతరం బుమ్రాను పర్సనల్‌గా ప్రశంసించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై 150పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చేధనలో భాగంగా బరిలోకి దిగిన చెన్నై దాదాపు గెలుపు అంచుల వరకూ చేరి ఓడింది. షేన్ వాట్సన్(80; 59 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచి ఆకట్టుకున్నాడు.
మ్యాచ్ అనంతరం సచిన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోనే బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆశించినంత మేర ప్రదర్శన ఇవ్వగలడు’ అని సచిన్ తెలిపాడు. యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అతని కెరీర్‌లోనే అత్యుత్తమమైన ప్రదర్శన ఇస్తున్నాడు’ అని వ్యాఖ్యానించాడు.
Bumrah, world's best: Sachin https://t.co/sV5YyQVegv via @ipl
— subhan (@subhn44) May 13, 2019