ENG vs IND : భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌ను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.

JioHotstar has bagged the digital rights for the 5 match Test series between India and England.
వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా ఇప్పటికే భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు.
ఇక ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ (కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) కలిగి ఉంది. అయితే సోనీ.. టీవీ ప్రసార హక్కులను ఉంచుకుని జియోహాట్‌స్టార్‌కు డిజిటల్ హక్కులను బదలాయించినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. దాదాపు నెల రోజుల చర్చల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ ఒప్పందం ఖరారు అయినట్లు పేర్కొంది.
IPL 2025 : పోతూ.. పోతూ.. ధోని సేన ఎంత పని చేసింది మామ.. నాలుగు టీమ్‌ల భవిష్యత్తే మారిపోయిందిగా..
🚨 ENGLAND TOUR ON JIOHOTSTAR. 🚨
– JioHotstar has bagged the digital rights for the 5 match Test series between India and England. pic.twitter.com/2a4EkKZ62L
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2025
అయితే.. దీనిపై సోని లేదా జియో హాట్‌స్టార్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను ఎక్కడ చూడొచ్చంటే..
టీవీల్లో సోనీ ఛానెల్స్‌లో భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రతక్ష్య ప్రసారం కానుంది. ఇక మొబైల్ ఫోన్లలో అయితే.. జియో హాట్ స్టార్ యాప్‌లో చూడొచ్చు.
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్‌కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు – లార్డ్స్
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కెన్నింగ్టన్ ఓవల్