హాఫ్ సెంచరీ బాది అజేయంగా నిలిచిన రస్సెల్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.

PIC: @IPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ 35, సునీల్ నరైన్ 11, అజింక్య రహానే 30, అంగ్క్రిష్ రఘువంశీ 44, ఆండ్రీ రస్సెల్ 57 (నాటౌట్), రింకూ సింగ్ 19 (నాటౌట్) పరుగులు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
రాజస్థాన్ రాయల్స్ జట్టు
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్