SRH vs LSG: ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ బాదలేదు.. కానీ..

లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేశ్, రవి బిష్ణోయి, ప్రిన్స్‌ యాదవ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

SRH vs LSG: ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ బాదలేదు.. కానీ..

PIC: @IPL (X)

Updated On : March 27, 2025 / 9:51 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ కొనసాగుతోంది. టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్‌ మొదట బౌలింగ్ తీసుకుంది. లక్నో ముందు ఆర్సీబీ 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 47, అభిషేక్ శర్మ 6, ఇషాన్ కిషన్ 0, నితీశ్ కుమార్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెన్ 26, అంకిత్ వర్మ 36, అభినవ్ మనోహర్ 2, పాట్ కమిన్స్ 18, హర్షల్ పటేల్ 12 (నాటౌట్), మొహమ్మద్ షమీ 1, సిమర్జీత్ సింగ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 190-9గా నమోదైంది.

లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేశ్, రవి బిష్ణోయి, ప్రిన్స్‌ యాదవ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్