SRH : సన్‌రైజర్స్ కొంపముంచుతున్న ఆ ఇద్దరు.. ఒకరు బ్యాటింగ్‌లో, మరొకరు బౌలింగ్‌లో.. ఒక్కొక్కరికి 10 కోట్లు పైనే..
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇది సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి కావడం గమనార్హం. దీంతో ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఈ క్రమంలో ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఎన్నో అంచనాలతో మెగావేలంలో కొనుగోలు చేస్తే ఒకరు బ్యాటింగ్‌లో పరుగులు చేయడం లేదని, మరొకరు బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇస్తూ జట్టు ఓటములకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు.
ఇషాన్ కిషన్..
ఐపీఎల్ మెగావేలం 2025లో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు జట్టుకు అడ్వాంటేజ్‌గా మారుతాడని, తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తాడని ఇలా ఎన్నో ఆశలను పెట్టుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లోనే శతకాన్ని సాధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే.. ఆ తరువాతే అసలు కథ మొదలైంది.
ఈ మ్యాచ్ తరువాత ఇషాన్ కిషన్ ఫామ్ కోల్పోయాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలం అవుతున్నాడు. రాజస్థాన్ మ్యాచ్ తరువాత మరో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన ఇషాన్ కిషన్ కనీసం 20 పరుగుల మార్క్‌ను సైతం దాటలేకపోయాడు. ఇక కీలకమైన గుజరాత్ మ్యాచ్‌లో 225 పరుగుల లక్ష్య ఛేదనలో 17 బంతులు ఆడి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో ఔటౌతూ ఇంకా ఒత్తిడి పెంచుతున్నాడు.
మహ్మద్ షమీ..
చాన్నాళ్లుగా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న భువనేశ్వర్ కుమార్‌ను మెగావేలానికి విడిచిపెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అతడిని కాదని వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీని 10 కోట్లకు కొనుగోలు చేసింది. షమీ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తాడని భావించింది. అయితే.. మైదానంలో దిగే సరికి అంచనాలు తప్పాయి.
కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగం అవుతాడని అనుకుంటే ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు షమీ. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా 11.23 ఎకానమీతో 337 పరుగులు ఇచ్చాడు. కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 48 పరగులు ఇచ్చాడు. దీంతో వీరిద్దరిని వదిలివేయాలని ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ కు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.